Site icon HashtagU Telugu

Loan APP Case : లోన్ యాప్ కేసు చేదించిన విజయవాడ పోలీసులు.. ఆరుగురు అరెస్ట్‌

Dcp Vijayawada Imresizer

Dcp Vijayawada Imresizer

లోన్ యాప్ నిర్వాహ‌కుల వేధింపులతో ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో మ‌ణికంఠ అనే ఆటో డ్రైవ‌ర్‌ మృతి చెందాడు. అయితే ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న విజ‌య‌వాడ పోలీసులు లోన్ యాప్ నిర్వాహ‌కుల‌ను ప‌ట్టుకున్నారు. ఈ నెల 13 లోన్ యాప్స్ వేధింపులతో లంకా మణికంఠ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని.. లోన్ యాప్ కేసును సీరియస్ గా తీసుకుని లోతైన దర్యాప్తు చేశామ‌ని డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. ముంబై, కర్ణాటక, యూపీ, రాజస్థాన్ కు ఐదు ప్రత్యేక బృందాలు వెళ్లాయని.. వండర్ అనే యాప్ నుండి లంకా మణికంఠ రూ.88వేలు లోన్ తీసుకుని..వాటిలో రూ.42 వేలు లోన్ క‌ట్టాడ‌ని తెలిపారు. సోహైల్, లతీఫ్, అనురాగ్ సింగ్, నవీన్, మంజునాథ్, శంకరప్ప అనే నిందితులను అరెస్ట్ చేశామని.. 138 అకౌంట్లలోని రూ.8 కోట్లు ఫ్రీజ్ చేశామ‌ని డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. నిందితులను థర్డ్ పార్టీల ద్వారా మారుమూల గ్రామాల్లోని రైతుల బినామీ అకౌంట్లకు డబ్బులు వేయిస్తున్నారని.. వివిధ కారణాలు చెప్పి పల్లెటూర్లలోని అకౌంట్లను అద్దెకు తీసుకుంటున్నారన్నారు. సోహైల్ లతీఫ్ లు ముంబైలో ఒక కంపెనీ పెట్టి చైన్ లింక్ ద్వారా ఈ వ్యవహారం నడుపుతున్నారని.. లోన్ యాప్స్ ను ఎవరూ నమ్మవద్దని పోలీసులు కోరారు. డబ్బులు అవసరం అయితే బ్యాంకులనుండి మాత్రమే తీసుకోవాలని ప్ర‌జ‌ల‌కు సూచించారు.