YSRCP Vs TDP : జగన్ ‘ఎక్స్’ పేజీలో సినిమాలు లైవ్.. వ్యూస్ కోసమే పాకులాట : టీడీపీ

YSRCP Vs TDP : ఎన్నికల వేళ టీడీపీ, వైఎస్సార్ సీపీలు సోషల్ మీడియా వేదికగా ముమ్మర ప్రచారం చేసుకుంటున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Ysrcp Vs Tdp

Ysrcp Vs Tdp

YSRCP Vs TDP : ఎన్నికల వేళ టీడీపీ, వైఎస్సార్ సీపీలు సోషల్ మీడియా వేదికగా ముమ్మర ప్రచారం చేసుకుంటున్నాయి. పోటాపోటీ పోస్టులతో తలపడుతున్నాయి.  లోపాలను ఎత్తి చూపించుకుంటూ.. విమర్శలు గుప్పించుంటూ.. ఆరోపణాస్త్రాలను సంధిస్తూ సోషల్ వార్‌ను హీటెక్కిస్తున్నాయి. జగన్ సేన, చంద్రబాబు సేన, జనసేన వారిదైన స్టైల్‌లో పోస్టులు పెడుతూ ప్రజల చూపును తమ వైపునకు తిప్పుకుంటున్నాయి. తాజాగా టీడీపీ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join

వైఎస్ జగన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్‌‌కు వ్యూస్‌ను సాధించడానికి చీప్ ట్రిక్స్‌ను ప్లే చేస్తున్నారంటూ టీడీపీ మండిపడింది. ఆ అకౌంటులో వైఎస్ జగన్ లైవ్ సెషన్‌కు బదులుగా పాపులర్ తెలుగు సినిమాల వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారని టీడీపీ తన పోస్టులో వ్యాఖ్యానించింది. వ్యూస్‌ను పెంచడానికే ఇలా చేస్తున్నారని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్‌ను కూడా టీడీపీ తన పోస్టులో జతపరిచింది. ‘‘అనంతపురం జిల్లా గుత్తిలో వైఎస్ జగన్ రోడ్ షో అని పోస్టులో ప్రస్తావన ఉంది.. కానీ ఆశ్చర్యకరంగా అక్కడ ఓ సినిమా వీడియోను ప్లే చేశారు’’ టీడీపీ సోషల్ మీడియా టీం వెల్లడించింది. ఏదిఏమైనప్పటికీ దీనిపై  నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. టీడీపీ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్(YSRCP Vs TDP) దీనిపై ఎవరికి వారుగా తమదైన స్టైల్లో అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. తమతమ అభిమాన నేతలకు మద్దతును ప్రకటిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటి ? అనేది కూడా టైప్ చేసి చెప్పేయండి మరి!!

Also Read : Premalu OTT Release : ఫ్యాన్స్ డిజప్పాయింట్ .. ప్రేమలు ఓటీటీ రాలేదు ఎందుకంటే..?

  Last Updated: 30 Mar 2024, 08:10 PM IST