Site icon HashtagU Telugu

Pithapuram: పవన్ ని ఓడించేందుకు కుట్ర..పిఠాపురంలో 80 లక్షల మద్యం సీసాలు..

Pithapuram

Pithapuram

Pithapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో ఇప్పుడు అందరి చూపు ఆ నియోజక వర్గంపైనే పడింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక ఎత్తయితే పిఠాపురంలో రాజకీయాలో మరో ఎత్తుగా మారాయి. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్ ఈ సారి ఎన్నికల్లో భారీ మెజారిటీపై కన్నేశారు. దీంతో అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా పవన్ కళ్యాణ్ వదిలిపెట్టడం లేదు. మరోవైపు పవన్ ని ఓడించేందుకు అధికార వైసీపీ పార్టీ తన మార్గాన్ని అనుసరిస్తోంది.

పిఠాపురంలోని వైఎస్ఆర్ గార్డెన్ ప్రాంతంలో కుమారపురంలో రూ.80 లక్షల విలువైన మద్యం సీసాలు వెలుగు చూశాయి. దీంతో అక్కడ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒకే ఇంట్లో 2560 లీటర్లకు పైగా మద్యం నిల్వ ఉన్నట్లు ఎక్సైజ్‌ పోలీసులు తెలిపారు. తనను ఓడించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ 40 మంది స్మగ్లర్లను పిఠాపురంలో మోహరించిందని పవన్ కళ్యాణ్ ఆరోపించిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో భారీ ఎత్తున మద్యం వెలుగు చూసింది.

We’re now on WhatsAppClick to Join

పిఠాపురంలో గంధపు చెక్కల స్మగ్లర్లు, సంఘవ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉన్నాయని, తనను ఓడించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఇక్కడ ఉన్నారని పవన్ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. కాగా స్మగ్లర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలో భారీగా మద్యం బాటిళ్ల స్వాధీనం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Viral video: ఓటు వేసేందుకు వచ్చిన మహిళ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, ఏం జరిగిందంటే!