MP Mithun Reddy : వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. దాదాపు 8 గంటల పాటు ఆయనను వివిధ కోణాల్లో ప్రశ్నలు అడిగారు. లిక్కర్ స్కాంతో సంబంధమున్న వారితో మిథున్‌కు ఉన్న లింకులపై ఆరా తీశారు. మిథున్ ఇచ్చిన స్టేట్‌మెంట్లను రికార్డు చేసి, ఆయన సంతకాలను తీసుకున్నారు. విజయవాడ సీపీ, సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఈ విచారణ జరిగింది.
Also Read :Copper Vs Gold : ‘రాగి’ మరో ‘బంగారం’ కాగలదా ? అంత సీన్ ఉందా ?
ఈ అంశాలపైనే ప్రశ్నలు..
కోర్టు ఉత్తర్వుల మేరకు న్యాయవాది సమక్షంలో ఇవాళ మిథున్‌రెడ్డిని(MP Mithun Reddy) సిట్ అధికారులు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటి ? డిస్టిల్లరీ నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లలో మీ పాత్ర ఏమిటి ? రాజ్ కసిరెడ్డికి చెందిన ఆదాన్ డిస్టిల్లరీ, డికార్ట్ నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎంతమేర మద్యాన్ని కొనుగోళ్లు చేసింది ? రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరులు చాణక్య రాజ్, అవినాష్‌రెడ్డిలతో మీకున్న సంబంధాలు ఏమిటి ? వారితో చేసిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి ? ఆదాన్ డిస్టిల్లరీ, డీకార్ట్ కు వందకోట్ల రుణం ఇప్పించడంలో మీ పాత్ర ఏమిటి ? వంటి ప్రశ్నలను మిథున్‌కు అధికారులు సంధించారు.ఈక్రమంలో కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలను దాటవేశారని సమాచారం. ఈ వ్యవహారంపై మరోసారి మిథున్‌ను సిట్ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉంది.
Also Read :Underworld Don: అండర్ వరల్డ్ డాన్ కుమారుడిపై కాల్పులు.. ముత్తప్ప రాయ్ ఎవరు ?
విజయసాయిరెడ్డి, రాజ్ కసిరెడ్డి..
ఈ కేసులో ఇదివరకే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కాం ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి నాలుగోసారి నోటీసులు పంపించినా, ఆయన విచారణకు హాజరు కాలేదు. రాజ్ కసిరెడ్డి తండ్రిని రెండు రోజుల పాటు విచారించిన సిట్, ఆయన గురించి సమాచారం లేకపోవటంతో మరింత నిశితంగా దర్యాప్తు చేపట్టింది.