Site icon HashtagU Telugu

Andhra Pradesh : ఏపీలో మందుబాబుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ షాక్‌.. మ‌ద్యం ధ‌ర‌లు పెంచుతూ ఉత్త‌ర్వులు

Bars

Bars

ఏపీలో మందుబాబుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ షాక్ ఇచ్చింది. మ‌ద్యం ధ‌ర‌లు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెంచిన ధ‌ర‌లు నేటి నుండి అమ‌ల్లోకి రానున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. క్వార్టర్‌పై రూ.10, ఫుల్‌ బాటిల్‌పై రూ.20 ధర పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఫారిన్‌ లిక్కర్‌ ధరలు 20% పెరిగింది. రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ ను రూపాయల నుంచి శాతాల్లోకి ఏపీ ప్రభుత్వం మార్చింది. ఏఆర్‌ఈటీ శ్లాబులు రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై సమానంగా ప‌న్నులు లేవ‌ని ఎక్సైజ్‌శాఖ భావించింది. అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి ఎక్సైజ్ శాఖ మార్చింది. ఐఎంఎఫ్ఎల్‌ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం పెంపు , బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఫారిన్‌ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ పెంచింది. ప్ర‌భుత్వం పెంచిన ధ‌ర‌ల‌తో మందుబాబుల‌కు కిక్కు దిగేలా ఉంది. నాసిర‌కం మ‌ద్యంతో పాటు కొత్త కొత్త బ్రాండ్లు తాగుతూ ఇబ్బందులు పడుతున్న మందుబాబులు ధ‌ర‌లు పెర‌గ‌డంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read:  Ponguleti Srinivas Reddy : డబ్బుల సంచులు ఇచ్చినంత మాత్రాన సత్తుపల్లి ప్రజలు మోసపోరు – పొంగులేటి

Exit mobile version