Site icon HashtagU Telugu

Liquor Door Delivery: ఏపీలో ఇంటివద్దకే మద్యం

Liquor Door Delivery In Ap

Liquor Door Delivery In Ap

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం (Liquor) అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎంతలా అంటే..ఇంటివద్దకే మద్యం (Liquor door delivery) అందించే రేంజ్లో. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటి వద్దకే మద్యం చేరుతుండడంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మద్యం హోం డెలివరీ నిర్వహిస్తున్నారు. కుక్కునూరు మండలం బయ్యనగూడానికి చెందిన ఓ వ్యక్తి, జంగారెడ్డిగూడెం నుంచి మద్యం సీసాలను తీసుకొచ్చి గ్రామాల్లో అమ్ముతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు.

ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం హోం డెలివరీ చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, మిగతా వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మద్యం ధరల పెంపుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మద్యం ధరలు తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఇప్పుడు బాటిల్‌పై రూ.10 పెంచారని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధరల నియంత్రణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా బీర్ ధరలను భారీగా పెంచింది ప్రభుత్వం. బీర్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించబోమని, రేట్లు పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి జనవరిలో ప్రకటించారు. కానీ రెండు నెలలు గడవకముందే ధరలు పెంచి మాట తప్పారు. ఇలా ఇద్దరు తెలుగు సీఎంలు మద్యం విషయంలో మాట తప్పడం పై మందు బాబులు మాత్రమే కాదు ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.