Site icon HashtagU Telugu

Gannavaram : అయ్యో..కళ్లముందే 10,500 లీటర్ల మద్యం ధ్వంసం

Police Destroy Liquor Bottl

Police Destroy Liquor Bottl

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండవేడికి తట్టుకోలేక మందుబాబులు అల్లాడిపోతున్నారు. ఇదే క్రమంలో ఎన్నికల హోరు నడుస్తుండడంతో మందుబాబులకు చేతినిండా డబ్బు , మద్యం లభిస్తుండడంతో ఈ ఎండాకాలం అయ్యాక ఎన్నికల పోలింగ్ జరిగితే బాగుండు..అప్పటి వరకు చేతిలో మందు దొరికేది అని అనుకుంటున్నారు. ఇదే తరుణంలో వారి కళ్ల ముందు ఒక లీటరు కాదు రెండు లీటర్లు కాదు ఏకంగా 10,500 లీటర్ల మద్యాన్ని ధ్వసం (Liquor Bottles) చేస్తుండడం తట్టుకోలేకపోయారు. కన్నీరు పెట్టుకునేంత పని చేసారు. ఈ ఘటన గన్నవరం (Gannavaram )లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

గన్నవరం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీ నేతలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గన్నవరం మండలం మెట్టపల్లి గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పట్టుబడిన 58032 మద్యం బాటిళ్లను పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. పట్టుబడిన 1230 క్వాటర్ బాటిల్స్ కేసులను జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఉంచి రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. అయితే జిల్లా ఎస్పీ , ఆర్వో జేసీ గీతాంజలిశర్మ రోడ్‌ రోలర్‌కు జెండా ఊపిన తర్వాత బాటిళ్లను తొక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. పోలీసులు, జనాలు భయపడ్డారు. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క మందుబాబులు మాత్రం ఆలా ధ్వసం చేయకుండా తమకు ఇస్తే బాగుండు కదా అని మాట్లాడుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ భారీగా డబ్బులు, బంగారం, వెండి, మద్యం బాటిళ్లు పట్టుబడుతున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా మద్యం డంప్‌లను భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు ఎన్నికల అధికారులు, పోలీసులు. ఆలా పట్టుకున్న మద్యాన్ని ఇలా ధ్వసం చేస్తున్నారు.

Read Also : Rayapati Aruna : ప్రమాదానికి గురైన రాయపాటి అరుణ..జనసేన శ్రేణుల్లో ఆందోళన