Liquor Bottles Seized : క‌ర్నూల్‌లో అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టివేత‌.. ఇద్ద‌రు అరెస్ట్‌

క‌ర్నూల్‌లో అక్ర‌మ మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద

  • Written By:
  • Publish Date - April 30, 2023 / 08:30 AM IST

క‌ర్నూల్‌లో అక్ర‌మ మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద శనివారం మధ్యాహ్నం ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఇబి) పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 61 నాన్ డ్యూటీ పెయిడ్ (ఎన్‌డిపి) మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేసినట్లు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శేషాచలం తెలిపారు. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తున్న మోటార్ బైక్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పాల డబ్బాల్లో మద్యం సీసాలు ఉండడంతో పోలీసు సిబ్బంది అవాక్కయ్యారు. కల్లూరు మండలం పెద్ద టేకూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గొందిపర్ల మహేష్‌, కుర్వ మహేష్‌ అనే ఇద్దరు వ్యక్తులు పాల క్యాన్లలో ఎన్‌డిపిఎల్‌ మద్యం బాటిళ్లను తరలిస్తున్నారు.

వివిధ బ్రాండ్లకు చెందిన 61 మద్యం సీసాలు, రెండు పాల డబ్బాలు, ఒక మోటర్‌బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, తదుపరి చర్యల నిమిత్తం కేసును ఎస్‌ఈబీ స్టేషన్‌ హౌస్‌ అధికారికి అప్పగించినట్లు సీఐ తెలిపారు. సబ్ ఇన్‌స్పెక్టర్ జిలానీబాషా, కానిస్టేబుళ్లు మధుసూధన్, అన్సార్ బాషా, ప్రకాశరావు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మద్యం, ఇసుక, గుట్కా, గంజాయి అక్రమ రవాణాపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కోరారు.