AP Poll : పిఠాపురంలో వెనకడుగేసిన జగన్ .. ముందడుగేసిన పవన్

ఈ నెల 10 న రోడ్ షో కు అనుమతి కావాలని అధికారులను కోరారు. అయితే అదే రోజు సీఎం జగన్ పిఠాపురం లో భారీ సభ నిర్వహించాలని చూస్తుండడంతో అధికారులు పవన్ రోడ్ షో కు అనుమతి నిరాకరించారు

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 04:35 PM IST

పిఠాపురం (Pithapuram)..పిఠాపురం..పిఠాపురం ఇప్పుడు ఎక్కడ చూసిన..ఎక్కడ విన్న ఇదే పేరు మారుమోగిపోతుంది. మూడు నెలల క్రితం వరకు కూడా పిఠాపురం అనే పేరు తెలియనివారు సైతం ఇప్పుడు పిఠాపురం జపం చేస్తున్నారు. ఇంతలా మారుమోగిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడైతే పిఠాపురం లో పోటీ చేస్తున్నారని బయటకొచ్చిందో..అప్పటి నుండి పిఠాపురం గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. ఇక ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గరి నుండి ప్రతి ఒక్కరు పిఠాపురం బాట పట్టారు. దీంతో పిఠాపురం మొత్తం సినీ ప్రముఖులు, రాజకీయ నేతలతో హడావిడిగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి శుభం కార్డు పడనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరోసారి పిఠాపురం లో రోడ్ షో (Pawan Road Show) చేయాలనీ ప్లాన్ చేసారు. ఈ నెల 10 న రోడ్ షో కు అనుమతి కావాలని అధికారులను కోరారు. అయితే అదే రోజు సీఎం జగన్ పిఠాపురం లో భారీ సభ నిర్వహించాలని చూస్తుండడంతో అధికారులు పవన్ రోడ్ షో కు అనుమతి నిరాకరించారు, ఒకేరోజు ఇద్దరు అధినేతలు పర్యటిస్తే శాంతిభద్రతలకు ఇబ్బందిగా మారుతుందని జనసేన కు అభ్యర్థనను హోల్డ్ లో పెట్టారు. అయితే ఇప్పుడు జగన్ తన సభను రద్దు చేసుకోవడం తో జనసేన అధినేత రోడ్ షో కు లైన్ క్లియర్ అయ్యింది. 10వ తేదీన ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రోడ్ షో కు అనుమతి లభించడం తో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించాలని వైసీపీ గట్టి వ్యూహాలు రచిస్తోంది..కానీ ప్రస్తుతం మాత్రం పవన్ గెలుపు ఖాయమని అర్ధం అవుతుంది. 75 వేలనుండి లక్ష మెజార్టీ రావొచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇక సర్వేలో పవన్ గెలుపును అడ్డుకోలేరని తెలిసే జగన్ తన సభను రద్దు చేసుకున్నాడని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Kiraak RP : రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ ఆర్పీ.. మాకు గౌరవం ఇస్తేనే మీకు గౌరవమిస్తాం..