CBN ARREST : తనను అక్రమంగా అరెస్టు చేయడంపై కొద్దిసేపటి క్రితమే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు చూపించకుండా తనను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. అధికార బలం ఉందనే అహంకారంతో తనను అరెస్టు చేశారని ఆరోపించారు. ఎందుకు అరెస్టు చేశారని నేను అడిగితే పోలీసులు కనీస సమాధానం కూడా చెప్పలేదన్నారు. ప్రైమా ఫేసీని చూపించకుండా.. కేసులో వాస్తవికత గురించి, దానికి సంబంధించిన ఆధారాల గురించి చెప్పకుండానే అరెస్టు చేసి తీసుకెళ్లడం బాధకలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ఇది దారుణం.. కామన్ సిటిజెన్ కు కూడా ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ఉంటుంది. ఈవిషయాన్ని ఏపీ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇలా అరాచకంగా అరెస్టులు చేయకూడదు. నేనేం తప్పు చేశానో చెప్పకుండానే.. అదుపులోకి తీసుకున్నారు. చాలా బాధ కలుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నా గత నాలుగున్నర ఏళ్లుగా ప్రజా సమస్యలపై నేను అలుపెరగకుండా పోరాడుతున్నాను. అందుకే జగన్ సర్కారు కుట్ర పన్ని ఈవిధంగా అరెస్టు చేయించింది. నేనేదైనా తప్పు చేస్తే దాన్ని నిరూపించాలి. తప్పుడు కేసులు బనాయించి ఇలా ఇబ్బంది పెట్టడం అన్యాయం.. చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి’’ అని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
CBN ARREST : నా అరెస్టు వెనుక పెద్ద కుట్ర : చంద్రబాబు

CM Jagan Master Plan For Chandrababu Arrest