Site icon HashtagU Telugu

CM Chandrababu : బెట్టింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దాం : సీఎం చంద్రబాబు

Let's bring a special law to regulate betting: CM Chandrababu

Let's bring a special law to regulate betting: CM Chandrababu

CM Chandrababu: ఆన్ లైన్ బెట్టింగ్‌ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ ద్వారా ఒక్కరి జీవితం కాదు కుటుంబాలు సైతం నాశనం అవుతున్నాయని వీటికి చెక్ పెట్టాలంటే బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక చట్టం అవసరమని చంద్రబాబు అన్నారు. బెట్టింగ్ లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దామని తెలిపారు. మనం తీసుకునే నిర్ణయాలు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను పూర్తిగా అరికట్టేలా ఉండాలని చెప్పారు.

Read Also: Bank Holidays in April : ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..!

ఏపీలో ఇతర నేరాలు క్రమంగా తగ్గుతున్నా.. ఆర్థిక నేరాలు మాత్రం పెరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గంజాయి సాగు తగ్గింది. ఎక్కడైనా గంజాయి వినియోగం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోండి. టెక్నాలజీ వినియోగం పెంచడం ద్వారా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్స్ లాంటి వాటికి చెక్ పెట్టాలి అన్నారు. రాష్ట్రంలో నేరాలకు అడ్డుకట్ట వేయాలని, లేకపోతే ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఉన్నతాధికారులకు సూచించారు.

రాష్ట్రంలో ఇతర నేరాలు తగ్గాయి. కానీ ఆర్థిక నేరాలు పెరిగాయి. నేరస్థులు చాలా తెలివిగా సాక్ష్యాలు దొరక్కుండా మాయం చేస్తారు. పారిపోయే వారు కొందరైతే, పక్కవారిపై నేరాన్ని తోసేవారు మరికొందరు. వివేకానందరెడ్డి హత్య కేసు అందుకు ఉదాహరణ. ఐవోలు అప్రమత్తంగా ఉంటూ ఫోరెన్సిక్‌ ఎవిడెన్స్‌ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి. మావోయిస్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నేరాలు తగ్గించేందుకు వీలైనంత ఎక్కువగా అధునాతన టెక్నాలజీని వినియోగించుకోవాలి. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు అని అన్నారు.నేరాలను తగ్గించేందుకు పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మావోయిస్టుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలని చెప్పారు.

Read Also: Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి కూడా ఫుల్ కామెడీ..