CM Chandrababu: నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్ర్యోద్యమ వీరుడిగా దేశానికి ఆ మహానుభావుడు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేడ్కర్ సేవలను స్మరించుకుందామని అన్నారు.
Read Also: ‘Blue Origin’ : నేడు అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న మహిళల బృందం
ఇక, కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తామని.. అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి సీఎం ప్రాధాన్యమిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలిపారు.
మరోవైపు మంత్రి నారా లోకేశ్ కూడా అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ సమాజానికి అంబేడ్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని లోకేశ్ అన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని లోకేశ్ పిలుపునిచ్చారు.భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేడ్కర్ కృషి అమోఘమని కొనియాడారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమన్నారు. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని గుర్తుచేశారు.
Read Also: Laser Weapon: భారత్‌కు లేజర్ ఆయుధం.. కర్నూలులో ప్రయోగం సక్సెస్