Leopard : మహానంది క్షేత్రంలో చిరుత సంచారం..

మహానంది క్షేత్రంలోని పరిసర ప్రాంతంలోనే తిరుగుతుంది. అక్కడే సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి

Published By: HashtagU Telugu Desk
Leopard Spotted Near Goshal

Leopard Spotted Near Goshal

ఇటీవల కాలంలో చిరుతలు (Leopard ) అటవీ ప్రాంతాలను వదిలిపెట్టి..జనావాసుల్లో తిరగడం ఎక్కువైపోయాయి. ఓ చోట కాకపోతే ఓ చోట ఇలా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ వస్తున్నాయి. గత వారం రోజులుగా మహానంది క్షేత్రం (Mahanandi Temple)లో చిరుత సంచారం భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం సీసీ కెమెరాల్లో చిరుత కనిపించడం తో అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరుతపులి సంచారం ఉండటంతో భక్తులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ప్రజలు చెత్తా చెదారం వేయకూడదన్నారు. క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని కోరారు. రాత్రి 9 గంటల్లోగా క్షేత్ర పరిసరాల్లోని వ్యాపార సముదాయాలను మూసివేయాలని ఆదేశించారు. నల్లమల అడవికి అత్యంత దగ్గర ఉన్న దేవస్ధానం గోశాలను వేరే ప్రదేశానికి మార్పు చేస్తే మంచిందని టైగర్‌ ప్రాజెక్ట్‌ అధికారులు సూచించారు. దీంతో గోశాల (Goshala ) ఫెన్సింగ్‌ చుట్టూ గ్రీన్‌మ్యాట్‌ను ఏర్పాటు చేయించారు. మహానంది నుంచి బోయలకుంట్ల వైపు వెళ్ళే రహదారిని రాత్రి 10 గంటల నుండి మూసివేయాలని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

అధికారులు ఆలా చెపుతుండగానే నిన్న రాత్రి కూడా చిరుత కనిపించింది. మహానంది క్షేత్రంలోని పరిసర ప్రాంతంలోనే తిరుగుతుంది. అక్కడే సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. గోశాల దగ్గర చిరుత రాత్రి సంచరించినట్లు అక్కడి సీసీటీవీల్లో కనిపించింది. అయితే, అక్కడి చిరుత వచ్చి కాసేపు తిరిగి వెళ్లడం కెమెరాల్లో రికార్డైంది. దీంతో స్థానికులను, భక్తులను ఆలయ అధికారులు అలర్ట్ చేశారు. స్థానికులు ఎవరూ పెంపుడు జంతువులను బయటకు వదలొద్దని అటవీశాఖ అధికారులు తెలిపారు. అలాగే మహానంది పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ భక్తులు బయట పడకోవద్దని కూడా మైకుల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో వైపు అటవీ శాఖ అధికారులు చిరుత అక్కడే సంచరిస్తుండటంతో దానిని పట్టుకునేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్నారు.

Read Also : Virat Kohli & Rohit Sharma: ఆ ఇద్దరికీ ఇదే చివరి టీ ట్వంటీనా? పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే ఛాన్స్..!

  Last Updated: 29 Jun 2024, 01:00 PM IST