Site icon HashtagU Telugu

TTD : మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల్లో ఆందోళన

Wild Animal Alert

Wild Animal Alert

TTD : తిరుమల పుణ్యక్షేత్రం మరోసారి చిరుత ఆందోళనతో ఉలిక్కిపడింది. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు తరచుగా వాడే 500వ మెట్టు వద్ద చిరుతపులి కనిపించడంతో కలకలం రేగింది. పవిత్రమైన దర్శనం కోసం మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా చిరుతను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్తున్న కొందరు భక్తులకు 500వ మెట్టు సమీపంలోని చెట్ల పొదల్లో ఒక చిరుతపులి కనిపించింది. తమ కళ్లముందే చిరుతపులి కనిపించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు భక్తులు వెంటనే అప్రమత్తమై భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భద్రతా సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతను అక్కడి నుంచి తరిమేందుకు సైరన్‌ మోతతో ప్రయత్నాలు ప్రారంభించారు. చిరుతను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి పంపేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా, మెట్ల మార్గంలో మరింత అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. గతంలో శ్రీవారి మెట్ల మార్గంలో చిరుతల దాడులు, పిల్లల మరణాలు సంభవించిన నేపథ్యంలో, ఈ తాజా ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ట్రాప్‌ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసి, చిరుతలను బంధించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అవి మళ్లీ మళ్లీ మానవ సంచారం ఉన్న ప్రాంతాలకు రావడం ఆందోళన కలిగిస్తోంది. భక్తుల భద్రతకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు టీటీడీని కోరుతున్నారు. ఈ ఘటనతో శ్రీవారి మెట్ల మార్గంలో ప్రయాణించే భక్తుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. టీటీడీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎలా చూపుతుందో చూడాలి.

Phone Tapping : స్వదేశానికి తిరిగొస్తున్న ప్రభాకర్‌ రావు.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కొలిక్కి..!