TTD: ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం.. భయాందోళన లో భక్తులు!

  • Written By:
  • Publish Date - December 17, 2021 / 03:02 PM IST

తిరుమల తిరుపతిలో తరచుగా పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. ఒక్కోసారి అడవులను దాటి ఘాట్ రోడ్లు, మెట్ల మార్గంలోకి వస్తుంటాయి. టీటీడీ అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా పులల సంచారానికి బ్రేక్ పడటం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే తిరుమల ఘాట్ల రోడ్లపై చిరుతలు కనిపించడం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక రాత్రివేళలో ఘాట్ రోడ్డు ప్రయాణమంటేనే భక్తులు జంకుతున్నారు. ఒకవైపు పులుల సంచారం, మరోవైపు విషసర్పాల కదలికలు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి.

గత రెండు రోజుల క్రితం.. తిరుమల ఘాట్‌ సెక్షన్‌లో చిరుతపులి ద్విచక్రవాహనాన్ని వెంబడించి, ఇద్దరు వాహనదారులపై దాడి చేసింది. చిరుతపులి తిరుమల కొండలపై దట్టమైన వృక్షసంపదలో కనిపించకుండా పోవడంతో వాహనదారులు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బందికి స్వల్ప రక్తస్రావం జరిగినట్లు సమాచారం. వాహనదారులు రామకృష్ణారెడ్డి ఎలక్ట్రీషియన్‌గా, ఆనంద్‌ ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. టీటీడీ ఉద్యోగులిద్దరూ వరాహస్వామి అతిథి గృహంలో పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి సొంత వాహనాలపై వచ్చే భక్తులకు రహదారిపై అవగాహన లేకపోవడం కూడా పలు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే పది సంవత్సరాలకు పైబడిన వాహనాలు కనుమ రహదారిలో ప్రయాణించాలంటే వాటి సామర్థ్యం తప్పని సరి అని. సామర్థ్య, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలకు అన్ని పత్రాలు సరిచూసుకుని రావాలని సూచిస్తున్నారు.