తిరుమల (Tirumala) శ్రీవారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని..కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకోవాలని ప్రతి భక్తుడు అనుకుంటారు. కానీ ఇప్పుడు కాలి నడకన వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. నిత్యం కాలినడకన వెళ్లే భక్తుల (Devotees) ఫై క్రూరమృగాలు దాడి చేసి చంపేస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో రెండుసార్లు చిరుత దాడి (Leopard Attack ) చేయడం ఆందోళన కలిస్తోంది. నడక మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయం భయంగా తిరుమల (Tirumala) కొండకు చేరుకునే పరిస్థితి వచ్చింది.
శ్రీవారి దర్శనం ఏమోకానీ ఆ దారిలో వెళ్తే ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని భక్తులు బిక్కుబిక్కుమంటున్నారు. తరచూ చిరుతలు, ఎలుగుబంట్లు, పాముల సంచారం సాధారణమైపోతోంది. ఇప్పటి వరకు నడక మార్గంలో క్రూర మృగాలు తిరుగుతూ ఉండేవి కానీ ఎవరిపై దాడి చేసిన ఘటనలు చాలా అరుదుగా ఉండేవి. ఎవరి దారిలో వారు వెళ్లిపోయే వారు కానీ ఈ మధ్య కాలంలో చిరుత దాడులు ఎక్కువైపోయాయి.
నిన్నటికి నిన్న కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన వెళ్తుండగా..చిన్నారి లక్షిత (Lakshita) ఫై చిరుత దాడి చేసింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వాసులు దినేష్, శశికళ ఫ్యామిలీ శనివారం కాలినడకన కొండకు వెళ్లాని నిర్ణయించుకున్నారు. అలిపిరిలోని నడక మార్గంలో రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఫ్యామిలీలో ఎప్పుడూ హుషారుగా ఉండే లక్షిత అందరికంటే ముందు నడుస్తూ..పాటలు పడుతూ వెళ్ళింది. ఆలా వెళ్లిందో..లేదో తర్వాత చూస్తే కనిపించలేదు. లక్షిత కనిపించకపోయే సరికి తల్లిదండ్రులతోపాటు వారితో వచ్చిన వారిలో కంగారు మొదలైంది. మొత్తం వెతికారు. పిలిచారు అయినా లక్షిత పలకలేదు. ఏం జరిగిందో ఏమో అని వెంటనే ఆలయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. పాప కనిపించడం లేదని తెలుసుకున్న టీటీడీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం చెట్ల పొదల్లో కాలిమార్గంలో డెడ్ బాడీ లభ్యమైంది. ఎవరో ఎత్తుకువెళ్లారని అనుకున్నారు కానీ చిరుత దాడి చేస్తుందని అనుకోలేదు. ఇదే కాదు జూన్ నెలలో కూడా ఇలాగే జరిగింది. కానీ దేవుడి దయ వల్ల ఆ బాబు క్షేమంగా బయటపడ్డాడు.
దాడి జరిగినప్పుడల్లా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ప్రకటనలు చేయడమే కానీ తగిన చర్యలు తీసుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల (Tirumala) నడక మార్గంలో జరుగుతున్న వరుస ఘటనలకు పూర్తి బాధ్యత టీటీడీ, అధికారులదే బాధ్యత అనే చెప్పాలి. టీటీడీ భద్రత లోపం వల్లే చిన్నారి బలై పోయింది. కాలి నడకన కాస్త ఎప్పటికప్పుడు సెక్యూర్టీని పెంచడం..అలర్ట్ గా ఉండేలా చేస్తే..చిన్నారి ప్రాణాలు పోయేవి కాదుకదా. ఏది ఏమైనప్పటికి తిరుమల కాలినడకన అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది.
Read Also : Simple Energy: మార్కెట్‌లోకి సింపుల్ ఎనర్జీ నుంచి మరో ఈ- స్కూటర్.. దీని ధరెంతంటే..?!