Leader Of Oppostion: ఏపీ శాసనమండలిలో వైసీపీ పార్టీకి భారీ ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికలో ఓటమి పాలైన వైసీపీ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకుంది. అయితే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి లెక్క ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కదు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమకు ప్రతి పక్ష హోదా కల్పించాలని స్పీకర్ కు అర్జీ పెట్టుకున్నారు. అయితే ఆ పార్టీకి ఏపీ శాసనమండలిలోప్రతిపక్ష హోదా కల్పించింది. ఈ నిర్ణయంతో వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీగా కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ సోమవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. అంతకుముందు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా అధికారికంగా గుర్తించాలని అభ్యర్థిస్తూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే ఈ విషయమై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇంకా నిర్ణయం వెలువరించలేదు.
Also Read: Ram Charan : క్రిస్మస్ కి గేమ్ చేంజర్.. మెగా ఫ్యాన్స్ లో సంతోషం ఎందుకు లేదంటే..?
