Andhra Pradesh CM Chandrababu Naidu రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేశారు . అయితే, ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి జగన్‌పై అధికార పార్టీ నాయకులు విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలాటగా మార్చేశారని మండిపడ్డారు. ఇక వచ్చే ఏప్రిల్ 2న ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెడతారు.
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై చర్చించేందుకు శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రాజధాని అవసరం, అభివృద్ధి ప్రాధాన్యతలపై సభ్యులకు వివరించి తీర్మానం ఆమోదించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సుమారు 4 గంటల పాటు చర్చ జరగనుంది. అనంతరం ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. ఈ ప్రక్రియను సమన్వయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. 2014లో అమరావతి రాజధానిగా ఎంపిక. ఆ తర్వాత అన్ని పార్టీలు అమోదించాయి.
రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేశారు . అయితే, ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి జగన్‌పై అధికార పార్టీ నాయకులు విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలాటగా మార్చేశారని మండిపడ్డారు. ఇక వచ్చే ఏప్రిల్ 2న ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెడతారు.
రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దీనికోసం, ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత ఐదేళ్లుగా సాగుతున్న రాజధాని అనిశ్చితికి తెరదించి, ప్రజల్లో భరోసా నింపడమే ఈ తీర్మాన ప్రధాన ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఏపీకి ఒక శాశ్వత రాజధాని నిర్మాణం అనేది రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత అవసరమని, ఆ సంకల్పంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. “ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని వంటి కీలక నిర్ణయాలు మారకూడదు. అది రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలి పెట్టు” అని ఆయన అన్నారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నమని ఆయన పేర్కొన్నారు.
