Madanapalle Incident : రాజకీయాలు వదిలేస్తా..ఎంపీ మిథున్ రెడ్డి సంచలన ప్రకటన

తమ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారని.. వందల ఎకరాల భూములను ఆక్రమిచాంమని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు

Published By: HashtagU Telugu Desk
Leave Politics Mp Midhun Re

Leave Politics Mp Midhun Re

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైల్స్ దహనం కేసు (Madanapalle fire accident)లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) , ఎంపీ మిదున్ రెడ్డి (MP Mithun Reddy) లపై అనుమానాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన కు సంబదించిన కేసును ఇప్పటికే CBI కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఈ కేసు కు సంబంధించి దర్యాప్తు లోతుగా జరుపుతున్నారు. ఈ క్రమంలో ఎంపీ మిదున్ రెడ్డి ఈ ఘటన ఫై తొలిసారి స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

తాము అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తామని సంచలన ప్రకటన చేసారు. ఫైల్స్ దగ్ధం వెనుకున్న నిజా నిజాలు బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారని.. వందల ఎకరాల భూములను ఆక్రమిచాంమని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసమే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిజాలు బయటకు వెల్లడించాలని కోరారు. ఈ ఘటనలో అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిజాలు బయటకు వెల్లడించాలని కోరారు.

30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇన్‌కం ట్యాక్స్‌లో ఉన్నాయి. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. గత పది ఎన్నికల నుంచి రాజకీయాల్లో ఉన్నామని, ఏనాడు కూడా తమకు పార్టీ ఫండ్‌ గాని, ఎన్నికల్లో ఖర్చుకు గాని ఎవరైనా డబ్బులిచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని స్పష్టం చేశారు. రికార్డులు తారుమారు చేసేందుకే తమపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఎర్రచందనం (Redsandal) వ్యాపారం చేస్తున్నారని చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని కోరినా ఇంతవరకు స్పందన లేదని అన్నారు.

Read Also : Game Changer : జరగండి సాంగ్‌లో ఉండే మరో హుక్ స్టెప్ పై థమన్ ఆసక్తికర కామెంట్స్..

  Last Updated: 25 Jul 2024, 08:22 PM IST