Site icon HashtagU Telugu

Pawan Kalyans : టీడీపీ వాళ్లని చూసి నేర్చుకోండి.. జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ సూచన!

Learn from TDP people.. Pawan Kalyan advice to Janasena leaders!

Learn from TDP people.. Pawan Kalyan advice to Janasena leaders!

Pawan Kalyans Advice To Janasena Leaders: టీడీపీ(tdp) వాళ్లని చూసి నేర్చుకోండి..వాళ్లను ఫాలో అవ్వండి అని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సూచనలు చేశారు. పిఠాపురంలో ప్రతి ఓటర్‌తో ఫోటో దిగుతానని… రోజుకు 200 మంది ఓటర్లలో పిఠాపురం నియోజకవర్గంలోని అందరితో ఫోటో దిగుతాని చెప్పారు. పిఠాపురంలో మెజారిటీ ఎంత రావాలి అనేది మీకే వదిలేస్తున్నానని వివరించారు పవన్ కళ్యాణ్.

Read Also: Dj Tillu 2 : టిల్లు కు సండే లేదు..మండే లేదు..అదే దూకుడు

నన్ను, సెక్యూరిటీ వాళ్లను బ్లేడ్లతో కట్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయన్నారు. వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

పగిలే కొద్ది గ్లాస్ పదును ఎక్కుతుందని… కిరాయి మూకలు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీని నన్ను కట్ చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అందరూ ప్రోటోకాల్ పాటించాలని.. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు అందరూ తెలుసుకోవాలని తెలిపారు. పిఠాపురం నా స్వస్థలం చేసుకుంటాను… నేను దేవుడిని నా గురించి ఎప్పుడూ ఏమీ అడగలేదని వెల్లడించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

మరోవైపు జనసేన పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, అన్ని వర్గాల వారికి దగ్గరవ్వాలని కోరుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మధ్యాహ్నం పొన్నాడ గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి, అక్కడి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఓ సామాన్యుడి ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లగా, అక్కడ నెలకొన్న కోలాహలం మామూలుగా లేదు. పవన్ కల్యాణ్ అంతటివాడు తమ ఇంటికి రావడంతో, ఆ కుటుంబానికి చెందినవారు ఉబ్బితబ్బిబ్బయిపోయారు. సాధారణ వ్యక్తిలా నవ్వారు. మంచంపై కూర్చున్న పవన్ కల్యాణ్, ఆ ఇంటివారితో మాట్లాడారు. వారు కూడా పవన్ ను తమ సొంత మనిషిలా భావించి కష్టనష్టాలు చెప్పుకున్నారు.

Read Also: Ben Stokes: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు స్టార్ క్రికెట‌ర్ దూరం.. కార‌ణ‌మిదే..?

గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్… ఈసారి పిఠాపురం నుంచి చావోరేవో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ తాను పోటీ చేసేందుకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన పిఠాపురంలోనే మకాం వేసి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కు పోటీగా వైసీపీ ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు. వంగా గీత కూడా ఎక్కడా తగ్గకుండా ప్రచారంలో ముందుకు పోతున్నారు.