Leaders Objection On Jagan Tirumala Visit : తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ వివాదం సాగుతున్న క్రమంలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ (Jagan) తిరుమల సందర్శనకు వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకుఈ నెల 27న సాయంత్రం మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తున్నట్లు జగన్ తెలిపారు.అలాగే 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు.
కాగా జగన్ తిరుమలకు వస్తాననడం ఫై బిజెపి , టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లాలని ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి డిమాండ్ చేశారు. జగన్ అన్యమతస్థుడు కావడంతో దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. నడక ప్రారంభానికి ముందు అలిపిరి వద్ద జగన్ తన విశ్వాసాన్ని ప్రకటించాలన్నారు. ఇటు రఘురామ కూడా జగన్ కు పలు కండీషనలు పెట్టారు. ముఖ్యంగా అన్యమతస్తుడైన జగన్ హిందూ మతం పట్ల విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నారు. అలాగే లడ్డూ వివాదం నేపథ్యంలో పాప పరిహారం కోసం జగన్ చెంపలేసుకుని, తిరుపతి లడ్డూ వాసన చూసి వదిలేయకుండా నిండు విశ్వాసంతో దాన్ని తినాలన్నారు. ఈ కండిషన్లు పాటించి ఆయన దర్శనానికి వెళ్లాలని కోరారు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన జగన్ ను స్వామి వారు పాప పరిహారం కోసం తిరుపతికి పిలిపించడం పట్ల రఘురామ సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అందరితో కలిసి స్వీకరించాలని జగన్ కు ఆయన సూచించారు. ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ ప్రసాదం ఎంతో నాణ్యంగా ఉందని కూడా తెలిపారు. భక్తులు కూడా లడ్డూ ప్రసాదంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రఘురామ సూచించారు.
Read Also : Hyderabad Musi : హైడ్రా అధికారులను పరుగులు పెట్టించిన మూసీ నిర్వాసితులు