CBI : విదేశాల‌కు ‘సీబీఐ’ కేసుల్లో నిందితులు

అనుమ‌తి లేకుండా ఏపీ సీఎం జ‌గ‌న్ దేశ విడిచి వెళ్ల‌కూడ‌దు. అలాగే, మాజీ పీఎం సుజ‌నా చౌద‌రి కూడా దేశ హ‌ద్దులు దాట‌కూడ‌దు.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 02:00 PM IST

అనుమ‌తి లేకుండా ఏపీ సీఎం జ‌గ‌న్ దేశ విడిచి వెళ్ల‌కూడ‌దు. అలాగే, మాజీ పీఎం సుజ‌నా చౌద‌రి కూడా దేశ హ‌ద్దులు దాట‌కూడ‌దు. ఇద్ద‌రి మీద న్యాయ‌స్థానాల్లో కేసులు సీరియ‌స్ గా న‌డుస్తున్నాయి. రాజ్య‌స‌భ వేదిక‌గా బీజేపీలో టీడీపీని విలీనం చేయ‌డానికి కీ రోల్ పోషించిన లీడ‌ర్ సుజ‌నా. ఆ రోజు నుంచి ఆయ‌న మీద కేసుల విచార‌ణ స్లో అయింద‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. సీబీఐ లుక్ అవుట్ నోటీసులు ఉన్నందున ప్ర‌త్యేక అనుమ‌తి కోసం హైకోర్టును ఆశ్ర‌యించి అనుమ‌తి పొందారు. ఈనెల 30వ తేదీ నుంచి ఆగ‌స్ట్ 15వ తేదీ వ‌ర‌కు ఆయ‌న అమెరికా, యూర‌ప్ దేశాలకు వెళుతున్నారు.

ఇక ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌రోక్షంగా బీజేపీ నీడ‌న ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. ఆయ‌న‌కు నాంప‌ల్లిలోని సీబీఐ పారిస్ వెళ్ల‌డానికి అనుమ‌తిచ్చింది. ఇటీవ‌ల దావోస్ వెళ్ల‌డానికి అనుమ‌తి తీసుకుని లండ‌న్ వెళ్లారు. ఆ సంద‌ర్భంగా కొన్ని ఫిర్యాదులు ప్ర‌త్య‌ర్థులు చేసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా సీబీఐ ప‌ట్టించుకోలేదు. ఇలాంటి ప‌రిణామాల‌ను చూసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీబీఐ ద‌త్త‌పుత్రునిగా వర్ణిస్తున్నారు. సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఇచ్చిన అనుమ‌తుల మేర‌కు ఈనెల 28వ తేదీ నుంచి 10 రోజుల పాటు ప్యారిస్ లోనే జ‌గ‌న్ ఉంటారు. కుమార్తె విద్య‌న‌భ్య‌సిస్తున్న క‌ళాశాల స్నాత‌కోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు జ‌గ‌న్ పారిస్ వెళుతున్నార‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌ర్గాల స‌మాచారం. మంగ‌ళ‌వారం రాత్రి 7.30 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం నుంచి బ‌య‌లుదేరి పారిస్ వెళ‌తారు. వ‌చ్చే నెల 2వ తేదీ వ‌ర‌కు అక్క‌డే ఉంటార‌ని చెబుతున్నారు. జులై 3న ఆయ‌న తిరిగి తాడేప‌ల్లి చేరుకుంటారని సీఎంవో ఆఫీస్ మౌఖికంగా ఇస్తోన్న స‌మాచారం. ఇది పూర్తిగా వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న‌గా వైసీపీ చెబుతోంది.

సీబీఐ కేసుల‌ను ఎదుర్కొంటోన్న ఇద్ద‌రు ప్ర‌ముఖుల‌కు ఒకేసారి న్యాయ‌స్థానాలు అనుమ‌తి ఇవ్వ‌డం యాదృశ్చికంగా జ‌రిగింది. ఏపీ సీఎం జ‌గ‌న్ ఈనెల 28న సాయంత్రం ఇండియా దాడి వెళుతున్నారు. రెండు రోజుల త‌రువాత అంటే ఈనెల 30వ తేదీన మాజీ సీఎం సుజ‌నా చౌద‌రి భార‌తదేశాన్ని వీడుతున్నారు. తెలంగాణ హైకోర్టు సుజ‌నాకు అనుమ‌తి ఇవ్వ‌గా నాంప‌ల్లి సీబీఐ కోర్టు జ‌గన్ కు విదేశాల‌కు వెళ్ల‌డానికి అనుమ‌తి ఇవ్వ‌డం కొత్తేమీకాదు. గ‌తంలోనూ వీళ్లిద్ద‌రికీ కోర్టులు ప‌లుమార్లు విదేశాల‌కు వెళ్ల‌డానికి అనుమ‌తులు ఇచ్చిన విష‌యం విదిత‌మే. బెస్ట్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ. 6 వేల కోట్ల వరకు మోసం చేసిన కేసులో సుజనా చౌదరి పాత్ర ఉందంటూ సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీ చేయ‌డంతో ప్ర‌త్యేక అనుమ‌తులు లేకుండా ఆయ‌న విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త ప‌దేళ్లుగా సీబీఐ విచార‌ణను ఎదుర్కొంటున్నారు. ప‌లు క్విడ్ ప్రో కో కేసుల విచార‌ణ జ‌రుగుతోంది. ఆయ‌న అరెస్ట్ పై స్టే కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే 16 నెల‌లు జైలు జీవితం గ‌డిపిన ఆయ‌న మీద స్టే ఎత్తివేస్తే అరెస్ట్ కు మార్గం సుగ‌మ‌మం అవుతోంది. అందుకే, ఆయ‌న స్టే మీద ఏపీ ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నారు. ప్ర‌తి శుక్ర‌వారం సీబీఐ కోర్టుకు ఆయ‌న హాజ‌రు కావాలి. అందుకు మిన‌హాయింపును కూడా సీబీఐ కోర్టు ఇవ్వ‌డం జ‌రిగింది. ఇప్పుడు ఆయ‌న ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేందుకు అనుమ‌తినిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇదంతా బీజేపీ ప‌రోక్ష స‌హ‌కారంతో న‌డుస్తోన్న వ్య‌వ‌హారంగా ప్ర‌త్య‌ర్థి పార్టీల విశ్వాసం. ఆయ‌న్ను సీబీఐ ద‌త్త‌పుత్రుడిగా జ‌న‌సేన భావిస్తోంది. మొత్తం మీద సుజ‌నా చౌద‌రి, సీఎం జ‌గ‌న్ ఇద్ద‌రూ విదేశాల‌కు వెళ్ల‌డానికి కోర్టులు అంగీక‌రించ‌డంతో దేశాన్ని దాటి వెళుతున్నార‌న్న‌మాట‌.