Site icon HashtagU Telugu

Puneeth Rajkumar: తెనాలిలో పునీత్ రాజ్‌కుమార్ భారీ విగ్రహం

Punith

Punith

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూసి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. ఆయన మొదటి వర్ధంతిని పురస్కరించుకొని అభిమానులు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో పునీత్ జ్ఞాపకార్థం 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని రూపొందించారు. త్వరలో ఈ విగ్రహాన్ని బెంగళూరుకు తరలించనున్నారు. ప్రస్తుతం తెనాలిలో ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది.

త్వరలోనే బెంగళూరులో తరలించనున్న ఈ విగ్రహ తయారీకి దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని శిల్పులు పేర్కొన్నారు. ప్రస్తుతం తెనాలిలోని సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనగా ఉంచారు. నవంబర్ 1న పునీత్ రాజ్ కుమార్‌ గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథులుగా పాల్గొనబోతున్నారు. ఇక పునీత్ రాజ్‌కుమార్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని అభిమానులు కన్నడ నాట అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు.

Exit mobile version