Site icon HashtagU Telugu

IAS Transfers in AP : ఏపీలో పోలీస్ ఉన్న‌తాధికారుల భారీ బ‌దిలీలు

Dgp Rajendranath Reddy

Dgp Rajendranath Reddy

జిల్లాల సంఖ్య‌ను పెంచిన జ‌గ‌న్ స‌ర్కార్ పెద్ద ఎత్తున పోలీసు అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఒకేసారి 52 మంది అద‌న‌పు ఎస్పీల‌ను బ‌దిలీ చేసింది. ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య పెంపుకు అనుగుణంగా ఈ బ‌దిలీల‌ను చేసింది. మొత్తం జిల్లాల సంఖ్య‌ 26కు చేరిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి జిల్లాకు ఇద్ద‌రేసి అద‌న‌పు ఎస్పీలను కేటాయించింది. అన్ని జిల్లాల‌కు అద‌న‌పు ఎస్పీల పోస్టింగ్‌ల నేప‌థ్యంలో ఇత‌ర‌త్రా విభాగాల్లో ఖాళీగా ఉన్న అద‌న‌పు ఎస్పీ ర్యాంక్ పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. ఆ మేర‌కు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ఇంకా ఖాళీగా ఉన్న అద‌న‌పు ఎస్పీలు, వివిధ విభాగాల్లో అదే కేడ‌ర్‌లో ఖాళీ అయిన పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది.

తాజా బ‌దిలీల్లో విజయవాడ అడిషనల్ డీసీపీగా సి.జయరామరాజు, అనంతపురం అడిషనల్ ఎస్పీగా ఇ.నాగేంద్రుడు, తూర్పుగోదావరి అడిషనల్ క్రైమ్ ఎస్పీగా జి.వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా బి.నాగభూషణ్‌రావు, మెరైన్ అడిషనల్ ఎస్పీగా జీబీఆర్ మధుసూదన్‌రావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీగా జి.స్వరూపరాణి, అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా వెంకట రామాంజనేయులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీగా భవానీ హర్ష, విజయవాడ సిటీ అడిషనల్ క్రైమ్ డీసీపీగా పి.వెంకటరత్నం, విశాఖ ఏసీబీ అడిషనల్ ఎస్పీగా కె.శ్రావణి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ ఎస్పీగా చిదానందరెడ్డి, ప్రకాశం అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా కె.నాగేశ్వరరావు, గుంటూరు అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా కె.సుప్రజ, ఎస్‌ఈబీ అడిషనల్ ఎస్పీగా అస్మా ఫర్హీన్ పోస్టింగులు పొందారు.