ఫెంగల్ తుపాను (Cyclone Fengal) ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) తిరుమలలో కొండ చరియలు (Tirumala) విరిగిపడ్డాయి. “ఫెంగల్” తుపాను రాత్రి తీరం దాటడం తో తమిళనాడు , ఏపీలోని రాయలసీమ లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.తిరుపతి , నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో తీరం వెంబడి 70 నుంచి 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో తిరుమలలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఈ మార్గంలో కొంత సమయం వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే టీటీడీ సిబ్బంది అప్రమత్తమై ఎప్పటికప్పుడు జేసీబీలతో రోడ్ల మీదకు వచ్చిన బండరాళ్లను తొలగించి రోడ్డు మార్గాన్ని క్లియర్ చేస్తున్నారు. తిరుమలలో రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో స్థానికులు, శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి.తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి.ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. రాయలసీమ జిల్లాల్లో తూఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖపట్నం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతిలో వర్షాల కారణంగా విశాఖపట్నం- తిరుపతి విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాలతో చెన్నై ఎయిర్ పోర్టును సైతం తాత్కాలికంగా మూసివేశారు. దాంతో విశాఖపట్నం- చెన్నై విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్, విమనాశ్రయ అధికారులు తెలిపారు.
Read Also : Electricity Charges Hike : బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ – అంబటి సెటైర్లు