Landslides in Moghalrajpuram Vijayawada : పది రోజుల క్రితం ఎడతెరపిలేని వర్షం విజయవాడ (Vijayawada ) నగరాన్ని జలమయం చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో ఒకే రోజు 29 సెం,మీ వర్షం పడేసరికి వన్‌టౌన్, గురునానక్ కాలనీ, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వరనగర్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. నిర్మలా కాన్వెంట్ ప్రాంతం చెరువును తలపించింది. అలాగే ఏపీఐఐసీ కాలనీ రోడ్డు , మొగల్రాజపురంలో పాలి క్లినిక్ రోడ్డు , పాతబస్తీ పంజా సెంటర్లో మినార్ మసీదు, సింగ్‌నగర్‌లో ఇళ్లు ఇలా అన్ని ప్రాంతాలు మనిగాయి.
ఇప్పుడిప్పుడే ఆ వరదల్లో నుండి ప్రజలు కోలుకుంటున్నారు. అలాగే మొగల్రాజపురం(Moghalrajpuram )లో కొండచరియలు (Landslides ) విరిగిపడి నలుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇంద్రకీలాద్రిపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దేవస్థానానికి చెందిన సమాచార కేంద్రం ధ్వంసమైంది. పెద్ద బండరాళ్లు, ఒక్కసారిగా జారిపడడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలన్నీ ఇంకా మరచిపోకముందే మరోసారి విజయవాడ మాచవరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారమివ్వగా వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Read Also : Siddaramaiah Losing Top Post : నేనెందుకు సీఎం కాకూడదో చెప్పండి.. సిద్ధరామయ్య సలహాదారుడి సంచలన కామెంట్స్