Capital Vizag: దొర‌క‌ని దొర‌లు! అమ‌రావ‌తిని త‌ల‌ద‌న్నే విశాఖ భూ దందా!

అధికారంలో ఎవ‌రు ఉంటే వాళ్లు ఖ‌రీదైన భూముల‌ను దోచుకోవ‌డం తెలుగు రాష్ట్రాల్లో ప‌రిపాటి అయింది.

  • Written By:
  • Updated On - October 31, 2022 / 03:01 PM IST

అధికారంలో ఎవ‌రు ఉంటే వాళ్లు ఖ‌రీదైన భూముల‌ను దోచుకోవ‌డం తెలుగు రాష్ట్రాల్లో ప‌రిపాటి అయింది. ప్ర‌త్యేకించి ఏపీలోని విశాఖ‌, అమ‌రావ‌తి కేంద్రంగా భూ మాఫియా చేసిన నిర్వాకం ఆ రాష్ట్రాన్ని అధోగ‌తి పాలు చేసింది. విశాఖ కేంద్రంగా భూ కుంభ‌కోణం గురించి 2019 వ‌ర‌కు మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, అయ్య‌న్న పాత్రుడు చంద్ర‌బాబు వ‌ద్ద ర‌చ్చ చేసుకున్నారు. ఇప్పుడు అంత‌కు మించిన పంచాయ‌తీ జగన్ మోహన్ రెడ్డి తాడేప‌ల్లి ఆఫీస్ కేంద్రంగా జ‌రుగుతోంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన విశాఖ భూముల కుంభ‌కోణంపై వేసిన సిట్ నివేదిక ర‌హ‌స్యంగా ఉండిపోయింది. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జగన్ మోహన్ రెడ్డి వేసిన‌ మ‌రో సిట్ నివేదిక ఇచ్చిన‌ప్ప‌టికీ వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌డంలేదు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన బీజేపీ చంద్ర‌బాబు, జ‌గ‌న్ వేసిన సిట్ల‌ నివేదిక‌ల‌ను బ‌హిర్గతం చేయాల‌ని ఏపీ బీజేపీ నేత‌లు అక్టోబ‌ర్ 11న గ‌వ‌ర్న‌ర్ కు లేఖ రాశారు. స్పందించిన గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి లేఖను పంపింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌న ప్ర‌భుత్వం నుంచి రాలేదు. ఫ‌లితంగా రిజిస్ట్రేష‌న్ చ‌ట్టంలోని సెక్షన్ 22A ప్ర‌భావం దాదాపు 30,000 కుటుంబాలు ఆస్తులపై ప‌డింది.

Also Read:  PK: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు.. జగన్ కు సాయం చేయకుంటే బాగుండేది..!!

ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ నాయకులు కొంద‌రు ప్రభుత్వం నుంచి తీసుకున్న హయాగ్రీవ భూముల్లో రియల్ దందాకు తెగ‌బ‌డ్డారు. సుమారు రూ. 250కోట్ల రూపాయల విలువైన 12.51ఎకరాల భూమిలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఇందులో సూత్రధారి కావడం వల్లే కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ఉలుకూప‌లుకూ లేకుండా ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ వాళ్ల అనుచరుల ఆక్రమణల్లో ఉన్న కొన్ని భూములను విశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆనందపురం మండలం గుడిలోవ ప్రాంతంలో 8.81 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీన‌ప‌రుచుకున్నారు.

విశాఖ స‌రిహ‌ద్దుల్లోని 12 మండలాల్లో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఆ వ్యవహారంపై ఆనాడున్న ఇద్దరు మంత్రుల మధ్య వివాదం కూడా నడిచింది. అప్పట్లో ‘సిట్’ ఏర్పాటయ్యింది. కానీ, ఆ ‘సిట్’ నివేదిక బయటకు రాలేదు. పోనీ, వైసీపీ హయాంలో అయినా ఆ సిట్ నివేదికను బయటపెట్టారా.? అంటే అదీ లేదు. కార‌ణం అప్పుడు టీడీపీలో ఉన్న నాయ‌కులు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు.

Also Read:   AP Politics: జ‌గ‌న్ మీద ప‌వ‌న్ `ఆడిట్‌` అస్త్రం

ఇంకో వైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ కింద విశాఖపట్నంలో బీచ్ రోడ్డుతోపాటు ఇతర విలువైన స్థలాల్ని విక్రయించడానికి నేషనల్‌ బిల్డింగ్స్‌, కన్‌స్ట్రక్షన్‌ కార్పోరేషన్‌ (ఎన్‌బీసీసీ) ద్వారా వేలం నిర్వహించేందుకు 2021 ఏఫ్రిల్‌లో ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో పేర్కొన్న 18 స్థలాలకు రూ. 1,452 కోట్ల ఆఫ్ సెట్ ధరను నిర్ణయిస్తూ ఈ-వేలం నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ఎన్‌బీసీసీ వెబ్‌సైట్‌‌లో పేర్కొంది. ఈ ఆక్షన్‌పై హైకోర్డులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, కోర్టు ఈ వేలం ప్రక్రియను నిలిపి వేస్తూ స్టే విధించింది.

తాజాగా విశాఖలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల అధీనంలో ఉన్న స్థలాలను తాకట్టు పెట్టి రూ.1,600 కోట్లు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా కార్యాలయాలు, సంస్థల భూములన్నీ ఏపీఎస్డీసీ (ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్) కు బదిలీ చేయనున్నారు. విశాఖలో మొత్తం 214 ఎకరాల భూములను ఏపీఎస్డీసీకు బదిలీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏపీఎస్డీసీ అధీనంలో రాగానే వాటిని తాకట్టు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇలా ఒక వైపు ప్ర‌భుత్వం మ‌రో వైపు భూ క‌బ్జాకోరుల మ‌ధ్య విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌జా సంప‌ద క‌నుమ‌రుగు అవుతోంది.

Also Read:   Chiranjeevi BRS: టీఆర్ఎస్ ఆకర్ష్.. బీఆర్ఎస్ లోకి చిరంజీవి ఎంట్రీ!