Site icon HashtagU Telugu

Lakshmi Reddy: మాజీ మంత్రి రోజా బంధువుతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం

Lakshmi Reddy

Lakshmi Reddy

జనసేన నేత కిరణ్ రాయల్‌ పై లక్ష్మిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘‘మాజీ మంత్రి రోజా దగ్గర బంధువు అయినా మహిళతో కిరణ్ రాయల్‌కు అక్రమ సంబంధం ఉంది. రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్టు అయినప్పటికీ, రాత్రికి రాత్రే బయటకొచ్చాడు. దానికి అసలు కారణం, ఆయన రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధం. ఆ మహిళతో ఉన్న వీడియోలు, ఫొటోలు నా దగ్గర ఉన్నాయి. ఆమెను బెదిరించి బయటకొచ్చాడు. ఆ కారణంగానే గతంలో కిరణ్ రాయల్‌ను అరెస్టు చేసిన పోలీసులు తర్వాత వదిలేశారు’’ అని తెలిపారు.

‘‘కిలాడి లేడీ అని నాపై ఆరోపణలు చేశారు. అవసరానికి వాడుకుని, అవసరం తీరాక ఆమెపై కిరణ్ రాయల్ దాడి చేశాడు. కిరణ్ రాయల్ ఏం వ్యాపారాలు చేస్తున్నాడు? భూమన అభినయ్ రెడ్డితో నాకు అక్రమ సంబంధం ఉందని చెప్పడం దారుణం. భూమన అభినయ్ రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకోవడం కిరణ్‌కే చెల్లింది. చెన్నై నల్లి సిల్క్స్ చీరలు తెచ్చి శ్రీవారి వస్త్రం పేరుతో అమ్మడం, వ్యాపారం చేయడం కిరణ్ రాయల్ యొక్క పనిగా ఉంది. మోసం చేయడమే కిరణ్ రాయల్‌కు తెలుసు. ఫొటోలు మార్ఫింగ్ అని చెబుతూ నాపై కేసులు పెడుతున్నారు. 2.0 అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి ఫొటో మార్ఫింగ్ చేయడం నిజం కాదా? నేను పవన్ కళ్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేస్తాను, నువ్వు ఎంత అని బెదిరించడం నిజం కదా. మార్ఫింగ్ కేసులో ముందు కిరణ్ రాయల్‌ను అరెస్టు చేయాలి’’ అని లక్ష్మిరెడ్డి డిమాండ్ చేసింది.

Exit mobile version