Site icon HashtagU Telugu

Gannavaram: గన్నవరం పై లగడపాటి గురి?

Lagadapati Rajagopal Logo Imresizer

Lagadapati Rajagopal Logo Imresizer

ఏపీలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్లు ఉండ‌గానే ఇప్ప‌టి నుంచే ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తుంది.ఈ సారి మెజార్టీ సీట్ల‌ను సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్య నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నేత‌ల్ని బ‌రిలోకి దింపాల‌ని టీడీపీ భావిస్తోంది. ముఖ్యంగా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంపై చంద్ర‌బాబు స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతుంది. 2019 ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా గెలిచిన వల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ వైసీపీకి దగ్గరయ్యాడు. టీడీపి రెబల్ గా మారిన వంశీ చంద్ర‌బాబుపై వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేయ‌డం..అది కూడా స్వ‌యానా చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై కామెంట్స్ చేయ‌డంతో టీడీపీ టార్గెట్ చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా వంశీని ఓడించాల‌ని అధినేత నుంచి క్రిందిస్థాయి కార్య‌క‌ర్త వ‌ర‌కు చూస్తున్నారు.

అయితే ప్ర‌స్తుతం గ‌న్న‌వ‌రం టీడీపీకి ఇంఛార్జ్ గా బ‌చ్చుల అర్జునుడు ఉన్నారు. కానీ ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌పుతార‌నే ప్ర‌చారం కొంత‌కాలంగా జరుగుతుంది. వైసీపీ కి చెందిన ఓ అసంతృప్తి నేత‌ ను టీడీపీలోకి ఆహ్వానించి,ఆయన్ను గ‌న్న‌వ‌రం టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించుతారనే ప్ర‌చారం ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు ఆయనకు వెళ్ల‌లేదు. కానీ గ‌న్న‌వ‌రం నుంచి ఈ సారి కొత్త అభ్య‌ర్థిని యువ‌నాయ‌కుడిని బ‌రిలోకి దింపాల‌నే ఆలోచ‌న‌తో టీడీపీ ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్ గోపాల్ కుమారుడిని గ‌న్న‌వ‌రం నుంచి బ‌రిలోకి దింపాల‌ని టీడీపీ అధిష్టానం భావించిన‌ట్లు తెలుస్తోంది. వ‌ల్ల‌భ‌నేని వంశీ దూకుడికి ధీటైన అభ్య‌ర్థి ల‌గ‌డ‌పాటి కుమారుడే అంటూ టీడీపీలో చ‌ర్చ జ‌రుగుతుంది.ఇప్ప‌టికే టీడీపీలోని కీల‌క నేత‌లు ల‌గ‌డ‌పాటి రాజ్ గోపాల్ తో చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. మొత్తం మీద వంశీని ఓడించడానికి సరైన అభ్యర్థి అన్వేషణలో టీడీపీ ఉందని టాక్. చివరి నిమిషంలో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి .