Site icon HashtagU Telugu

Lady Aghori Arrest : పోలీసులపై దాడి చేసిన అఘోరీ

Aghori Arres

Aghori Arres

Lady Aghori Arrest : గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో మహిళా అఘోరి అలియాస్ శ్రీనివాస్ హలచల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా , యూట్యూబ్ పుణ్యమా అని ఈ అఘోరి పేరు మారుమోగిపోతుంది. తాజాగా ఈ అఘోరిని పోలీసులు కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మంగళగిరి జనసేన ఆఫీసు (Janasena Office) సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను కలిసేదాకా కదలనని భీష్మించుకుని కూర్చుంది. ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ను కోరతానని.. పవన్ కళ్యాణ్ రావాలి… అంటూ అఘోరి నినాదాలు చేసింది. అఘోరీ నిరసనతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు రంగంలోకి దిగి అక్కడి నుండి వెళ్లాలని , పవన్ కళ్యాణ్ సార్ ప్రస్తుతం ఇక్కడ లేరని , మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నారని సర్దిచెప్పారు. అయినాగానీ వినకుండా అలాగే కూర్చువడంతో చుట్టూ జనాలు గుమ్మిగూడారు. దీంతో మరింత ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇక పోలీసులు తమదైన శైలి లో హెచ్చరించారు. దీంతో అఘోరి పోలీసులపై విరుచుకపడింది. ఓ ఎస్సై పై ఏకంగా దాడి చేసింది. పిడి గుద్దులు గుద్దుతూ పై..పైకి వెళ్ళింది. పక్కనే ఉన్న పోలీసులు వార్నింగ్ లు ఇచ్చిన తగ్గలేదు. అలాగే మీదమీదకు వెళ్తూ ..బూతులు తిడుతూ..శాపనార్దాలు చేసింది. దీంతో ఆమెను బలవంతంగా కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి పోలీస్ జీపు ఎక్కించారు. దీనికి సంబదించిన వీడియో ఈ కింద మీరు చూడొచ్చు.

Read Also : Sri Lanka : శ్రీలంక ప్రధాన మంత్రిగా హరిణి అమరసూర్య నియామకం