AP: ఏపి ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిళ్లు..14 నుంచి ఆందోళన బాట

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 11:22 AM IST

AP Empolyees:తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఏపీలోని ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిళ్లు చేస్తున విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి సరైనా స్పందన లేకపోవడంతో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఏపీ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలోని 104 ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివారం భేటి అయి ఉద్యమ శంఖారావం పోస్టర్‌(Sankha Ravam Poster) ను విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉద్యోగ సంఘం నాయకుడు బండి శ్రీనివాస్‌ (Bandi Srinivas ) మాట్లాడుతూ.. ఈనెల 14న నల్లబ్యాడ్జీలు ధరించి వినతిపత్రాలు ఇస్తామని, 15,16వ తేదీల్లో భోజన విరామ సమయంలో పాఠశాలల్లో నిరసన, 17న మండల కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, ఈనెల 20న కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు అన్ని జిల్లాలో పర్యటన, 27న చలో విజయవాడ చేపడతామని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఏ క్షణమైనా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

Read Also : Yamuna Expressway: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం, ఐదుగురు సజీవ దహనం