ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (AP Skill Development) ఆధ్వర్యంలో కువైట్‌లో ఉద్యోగం చేయాలనుకునే నైపుణ్యం ఉన్న పురుషులకు అరుదైన అవకాశం లభించింది. సిరామిక్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, సీలింగ్ వర్క్ వంటి విభాగాల్లో అనుభవం ఉన్న 25 నుండి 50 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులు. దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఐటీఐ లేదా డిప్లొమా విద్యార్హత ఉండాలి. ఈ ఉద్యోగాలు 2 సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. అభ్యర్థులు వారానికి ఆరు రోజులు, రోజుకు తొమ్మిది గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాల్లో పని చేసే వారికి కంపెనీ తరఫున ఉచితంగా నివాస సదుపాయం (అకామిడేషన్), ట్రాన్స్‌పోర్ట్, వీసా ప్రాసెసింగ్, విమాన టికెట్లు, మెడికల్ ఖర్చులు అందించనున్నారు. సూపర్వైజర్ పదవికి నెలకు రూ.70,000 వరకు, వర్కర్‌కు రూ.56,000 వరకు జీతం చెల్లించనున్నారు. ఎంపిక ప్రక్రియలో టెక్నికల్ స్కిల్స్ అసెస్‌మెంట్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు తప్పనిసరిగా కనీసం 3-5 సంవత్సరాల అనుభవం ఉండాలి. అదేవిధంగా, ఇంగ్లీష్ లేదా హిందీలో కనీస కమ్యూనికేషన్ సామర్థ్యం అవసరం.
ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్, అనుభవ ధ్రువీకరణ పత్రం, విద్యా అర్హతల సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration అనే వెబ్‌సైట్ ద్వారా జూలై 12వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. వివరాలకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 9988853335, 8712655686, 8790118349, 8790117279 నెంబర్లకు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విదేశాల్లో ఉద్యోగం పొందే అవకాశాన్ని నైపుణ్యవంతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.