ఆంధ్రప్రదేశ్(AP)లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Kutami Govt) తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు (TDP -BJP- Janasena) కలిసి ఏర్పడిన ఈ కూటమి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 164 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. బుధవారం ఈ సంకీర్ణ పాలనకు ఏడాది పూర్తి కాగా, గురువారం రెండో ఏడాదిలోకి అడుగు పెట్టింది. సాధారణంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో తలెత్తే విభేదాలు, రాజీల తలంపులు ఏపీ కూటమిలో పెద్దగా కనిపించకపోవడం ఆశ్చర్యంగా మారింది. మూడూ పార్టీలు సమన్వయంతో ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతుండటమే దీనికి కారణంగా చెప్పవచ్చు.
CM Chandrababu : విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రికి సీఎం సూచన
ఈ ఏడాది కాలంలో కూటమి సర్కార్ పలు సానుకూల అంశాలను చాటిచెప్పింది. ముఖ్యంగా నారా లోకేశ్, పవన్ కల్యాణ్(Lokesh & Pawan)ల మధ్య ఏర్పడిన సోదర భావం ఈ కూటమికి ఒక గొప్ప బలంగా నిలిచింది. లోకేశ్ చేసిన నిరంతర పోరాటం, పవన్ కల్యాణ్ చూపిన అండ, బీజేపీతో కలిపి తీర్చిదిద్దిన వ్యూహాలు ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా మంత్రి పదవులు, రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాల పంపిణీలో చంద్రబాబు తీసుకున్న సుతారమైన నిర్ణయాలు మిత్రపక్షాలకు న్యాయం చేశారు. దీంతో పార్టీల మధ్య అవిశ్వాసానికి అవకాశం రాలేదు.
Fungal Infection: ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!
అయితే అన్ని విషయాల్లో ఐక్యత చూపిస్తున్నా, కొన్ని ప్రతికూలతలు కూడా కనిపించకుండా లేవు. ముఖ్యంగా టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాము ప్రధాన శక్తి అంటూ రెండు పార్టీల శ్రేణులు వాదనలు చేయడం వల్ల మనస్పర్థలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ శ్రేణులు కూటమి కార్యకలాపాల్లో పెద్దగా ఉత్సాహం చూపించకపోవడం గమనార్హం. బీజేపీకి చెందిన కీలక నేతలు కూడా కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేయడం కూటమిలో చిన్నచిన్న వివాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఓవరాల్ గా చూస్తే.. మొదటి ఏడాదిలో ఏపీ కూటమి సర్కార్ రాజకీయంగా స్థిరంగా, శాంతియుతంగా సాగినట్లు చెప్పొచ్చు. ప్రజల ఆశలతో ఏర్పడిన ఈ ప్రభుత్వం పాలనలోనూ సమతుల్యతను చూపించగలిగితే, రానున్న నాలుగేళ్లు మరింత విజయవంతంగా సాగే అవకాశముంది. అయితే శ్రేణుల మధ్య విభేదాలను నివారించడం, బీజేపీ పాత్రను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై కూటమి నేతలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.