గత వారం రోజులుగా మీడియా లో వైసీపీ మంత్రి రోజా (MInister Roja) ఫై టీడీపి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గాను గుంటూరు పోలీసులు సత్యనారాయణను అరెస్ట్ చేయడం..కోర్ట్ సొంత పూచీకత్తుపై బెయిల్ విడుదల చేయడం వంటివి జరిగాయి. అయినప్పటికీ దీనిపై ప్రతి రోజు ఎవరొకరు స్పందిస్తూ వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు. రోజా ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో చేసారని చంద్రబాబు , లోకేష్ , బాలకృష్ణ, భువనేశ్వరి , బ్రాహ్మణి ఇలా ఎంతోమందిపై అనేక సార్లు అనేక వ్యాఖ్యలు చేసారని టీడీపి నేతలు ఆరోపిస్తూ ఉండగా..వైసీపీ శ్రేణులతో పాటు పలువురు సినీ తారలు మాత్రం రోజా కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా సినీ నటి, బీజేపీ నేత కుష్బూ (Kushboo )సుందర్.. బండారు సత్యనారాయణ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని, తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని కుష్బూ మండిపడ్డారు. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు భద్రతకు, దిగజారుడు తనానికి నిదర్శనం అని , మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడారని కుష్బూ అన్నారు. ఈ విషయంలో మంత్రి రోజాకు తన మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని తెలిపారు.
మరోపక్క బండారు సత్యనారాయణ మాత్రం.. మహిళలంటే తనకెంతో గౌరవమని, గౌరవంతో బతికే కుటుంబాలపై రోజా (Minister Roja) ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే ఆమెకు బుద్ధి చెప్పానని ఆ విధముగా మాట్లాడానని చెప్పుకొచ్చారు. సాటి మహిళల్ని కూడా కించపరిచే మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారని తెలిపారు.
Read Also : Mahmood Ali: గన్ మెన్ చెంప చెల్లుమనిపించిన హోంమంత్రి, వీడియో వైరల్!