ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP) ఓ పక్క నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటిస్తూనే..మరోపక్క ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు జగన్ (Jagan). ఇక టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సైతం ఈసారి జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. దీంతో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటీకే చెరో రెండు స్థానాలను ప్రకటించిన అధినేతలు..ఇప్పుడు కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను 9 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఖరారు చేసినట్లు సమాచారం.
సామాజిక సమీకరణలు, విజయావకాశాలు, స్థానికంగా ఉన్న పట్టు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ నాయకత్వం వీరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదు సీట్లపై కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు (Kurnool ) జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలు.. కర్నూలు, నంద్యాల ఉన్నాయి. వీటి పరిధిలోని 14 అసెంబ్లీ సీట్లలో కర్నూలు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు సీట్లలో టీడీపీ నిలిపే అభ్యర్థులు దాదాపు ఖాయమయ్యారు.
నందికొట్కూరు (ఎస్సీ), కోడుమూరు(ఎస్సీ), ఆదోని, ఆలూరు, మంత్రాలయం సీట్లపై కసరత్తులు నడుస్తున్నాయి. నందికొట్కూరులో జయరాజు, జయసింహ, కాకర్లవాడ వెంకట స్వామి పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కుటుంబానికి చెందిన కొప్పుల లావణ్య తాజాగా రేసులోకి వచ్చారు. ఆమె భర్త టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న పార్టీ నేత మాండ్ర శివానంద రెడ్డి ఇటీవల ఈ నియోజకవర్గానికి ఓ అభ్యర్థి పేరు బహిరంగంగా ప్రకటించారు. కానీ పార్టీ వర్గాలు మాత్రం అధిష్ఠానం కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదని అంటున్నాయి. మొత్తం మీద మరో వారం రోజుల్లో అభ్యర్థుల తాలూకా ప్రకటన రానుందని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఫిబ్రవరి 04 న చంద్రబాబు అధ్యక్షతనటీడీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ, మండలిలో లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చంద్రబాబు MLAల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు, మాజీ మంత్రి గంటా రాజీనామా ఆమోదంపైనా ఇలా పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
అలాగే ఈ నెల 6న చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. గంగాధర నెల్లూరులో టీడీపీ నిర్వహించే ‘రా కదలిరా’ బహిరంగ సభలో పాల్గొని.. ప్రసంగిస్తారు. రామానాయుడు పల్లె బస్టాప్ వెనుక ఉన్న రైతుల స్థలంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Also : Cheaper Vs Dearer : కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే