కర్నూలు ఎయిర్ పోర్టు(Kurnool Airport)కు మహర్దశ రాబోతుంది. తాజాగా విమానాశ్రయం అభివృద్ధి(Airport Development)కి ప్రభుత్వం రూ. 4.43 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా రన్‌వే ఎండ్ సేఫ్టీ (RESA) పనుల కోసం రూ. 3.6 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే విమానాశ్రయ భద్రత కోసం కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ పరికరాల నిర్వహణకు రూ. 83 లక్షలు వెచ్చించనున్నారు. ఈ నిధుల కేటాయింపుతో విమానాశ్రయ సౌకర్యాలు మరింత మెరుగుపడి, భద్రతా ప్రమాణాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
Vinegar : వెనిగర్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
ఈ అభివృద్ధి చర్యలతోపాటు, కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్రాన్ని కోరినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ విషయమై ఆయన కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడిని కలవగా, ఆయన సానుకూలంగా స్పందించారు. కర్నూలు విమానాశ్రయం పనిచేయడం ద్వారా ప్రాంతంలోని పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని, ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌లో కొత్త పరిశ్రమల అభివృద్ధికి ఈ విమాన సౌకర్యాలు సహాయపడతాయని మంత్రి తెలిపారు.
Mahila Samman Savings Scheme : మహిళలకు షాక్ ఇచ్చిన కేంద్రం
అంతేకాకుండా రాష్ట్రంలో రక్షణ రంగ ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మంత్రి టీజీ భరత్ చర్చలు నిర్వహించారు. రక్షణ ప్రాజెక్టుల నిర్వహణ, అనుమతుల కోసం ప్రత్యేక సమీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. మరోవైపు ఏపీలో ఈ-గవర్నెన్స్‌పై 28వ జాతీయ సమావేశం జూన్ రెండో వారంలో విశాఖపట్నంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.