Pawan Varahi Yatra: వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు. తాజాగా పవన్ కళ్యాణ్ కాకినాడలో వారాహి కేంద్రంగా మాట్లాడిన మాటలు కాకా పుట్టించాయి. పవన్ వాడుక భాషపై ఆ పార్టీ నేతల్లోనూ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ తిట్ల పురాణం తప్ప ప్రజలనుద్దేశించి మాట్లాడిందేమి లేదన్నది ప్రధాన విమర్శ. ఎంతసేపు అధికార పార్టీని విమర్శించడమే తప్ప వారాహి యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటన్నది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పవన్ ఫెయిల్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పవన్ కాకినాడ యాత్రపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సినిమాటిక్ గా ఉందన్నారు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. తన అభిమానులను అలరించేందుకు యాత్ర పెట్టినట్టు ఉందని అభిప్రాయపడ్డారు. ఇంత వ్యక్తిగత దూషణ చంద్రబాబు కూడా చేయలేదని ధ్వజమెత్తారు. పాలిటిక్స్ అంటే వెకేషన్ కాదని, పవన్ రాజకీయాలను చూస్తుంటే వెకేషన్ కి వచ్చినట్టే ఉందన్నారు. సంస్కారం లేకుండా ఎమ్మెల్యే ద్వారంపూడిపై మాట్లాడిన పవన్ కి నిజంగా దమ్ము ఉంటె ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
పవన్ కళ్యాణ్ కాపులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, గతంలో కాపు నేత దాసరినారాయణరావుని పరామర్శించేందుకు చిరంజీవి వస్తే చంద్రబాబు అడ్డుకున్నాడని గుర్తు చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ మాటల్లో సబ్జెక్టు ఉండదని, సబ్జెక్టు లేనప్పుడే సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతారని పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు కురసాల.
Read More: Bandi Sanjay: ప్రజల ప్రాణాలు తీసేందుకే మీ సమ్మేళనాలు, ఉత్సవాలు, వేడుకలా?