KTR: జగనన్నకు చెప్తా, జాగా ఇప్పిస్తా.. ఐటీ కంపెనీలకు కేటీఆర్ పిలుపు

ఒకవైపు తెలంగాణ కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంటే, మరోవైపు ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.

  • Written By:
  • Updated On - October 6, 2023 / 05:22 PM IST

KTR: తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఇవాళ ఆయన హనుమకొండలోని మండికొండలో ఐటీ పార్క్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌కు, వరంగల్‌కు పెద్ద తేడా ఉండదని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఐటీ రంగంలో భవిష్యత్తు టైర్‌ 2 నగరాలదే అని చెప్పారు.  రానున్న రోజుల్లో వరంగల్‌కు హైస్పీడ్‌ రైలు వస్తుందన్నారు. ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరారు. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

అయితే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఐటీ పెట్టుబడులు, కీలక సంస్థల పెట్టుబడులు పెడుతున్నాయి. ఒకవైపు తెలంగాణ కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంటే, మరోవైపు ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. కేవలం వైజాగ్  మాత్రం ఐటీకి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఏపీలో పెట్టుబడులపై ప్రస్తావించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. కేటీఆర్ పిలుపుతో హన్మకొండలో సైయంట్, టెక్ మహీంద్రా, కాకతీయ ఐటీ సొల్యూషన్స్ మరియు వెంటోయిస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌తో సహా ఐటీ కంపెనీలు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌లో తమ యూనిట్లను స్థాపించాయి.

ఇప్పుడు క్వాడ్రంట్ రిసోర్సెస్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. సైయెంట్ దాదాపు 1,233 మంది సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఉపాధి కల్పించింది. టెక్ మహీంద్రా, 150; Ventois సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ 29, కాకతీయ IT సొల్యూషన్స్, ఆరుగురు నిపుణులు. క్వాడ్రంట్ రిసోర్సెస్ కంపెనీలో 500 మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా క్వాడ్రంట్‌ రిసోర్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వంశీరెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థులు కెరీర్‌ను నిర్మించుకోవడం కోసం వరంగల్‌లో తమ కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Also Read: priya prakash varrier : పరువాలతో చిత్తు చేస్తున్న ప్రియా వారియర్