Site icon HashtagU Telugu

AP Elections 2024: ఏపీలో గెలిచేది ఎవరు? కేటీఆర్ ఆన్సర్ ఇదే..

AP Elections 2024

AP Elections 2024

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోగా, అన్ని పార్టీలు ఎన్నికల పోరులో పూర్తిగా నిమగ్నయ్యాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు ఊపందుకుంటున్నాయి. ఇటీవ‌ల స‌ర్వేలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. మరికొన్ని సర్వేలు వైసీపీకి ఏ మాత్రం అనుకూలంగా రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్నికల ఫీవర్ మాములుగా ఉండేలా లేదు. మరోవైపు సీఎం జగన 175 సీట్లకు 175 గెలుచుకుంటామని చెప్తున్నారు. అటు ఎన్డీయే కూటమి మాత్రం వైసీపీ ఘోరంగా ఓటమి చెందుతుందని ప్రచారం చేస్తుంది.

ఇదిలా ఉండగా ఏపీ ఎన్నికల వాతావరణంపై తాజాగా కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారందరూ నా స్నేహితులేనని అన్నారు కేటీఆర్. జగన్ తనకు అన్నలాంటి వాడని, అలాగే నారా లోకేష్ తనకు స్నేహితుడని, చంద్రబాబు పెద్దవారని, పవన్ కల్యాణ్ కూడా తనకు బ్రదర్ తో సమానమని కేటీఆర్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే అక్కడ గెలిచే పార్టీ ఏంటనే దానిపై క్లారిటీగా చెప్పకపోవడం ఆసక్తిదాయకం. అయితే కేటీఆర్ సమాధానమిస్తూనే ఏపీలో ఎవరు గెలిచినా ఆంధ్రాప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఏపీలో ఎవరు గెలిస్తే మీరు చూడాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకు కేటీఆర్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతానికి అయితే నాకు ఆంధ్రాలో ఓటు లేదని సరదాగా వ్యాఖ్యానించారు. ఇకపోతే ఏపీ , తెలంగాణ ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని చెప్పిన విషయాన్నీ గుర్తు చేశారు.

We’re now on WhatsAppClick to Join

ఇదిలా ఉండగా ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్డీయే కూటమి, వైసీపీ పార్టీలపై తాజాగా సర్వేలో వచ్చిన రిపోర్ట్స్ ని బట్టి చూస్తే.. టీడీపీ కూటమి ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ఓ సర్వేలో హైలైట్ చేశారు: అంతర్గత విభేదాలు మరియు సీట్ల పంపకంపై విభేదాలు మరియు క్యాడర్ సభ్యుల మధ్య విశ్వాసం లేకపోవడం కూటమి పనితీరుకు ఆటంకం కలిగిస్తుందని సర్వే తెలిపింది. అలాగే వైసీపీ సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతా ఇస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది తాజా సర్వే. కాకపోతే కేడర్ మరింత బలపడినట్లు,, వాలంటీర్ వ్యవస్థ ద్వారా వైఎస్ జగన్ కు ప్రజల మద్దతు దక్కొచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం పార్టీకి మేలు చేసే విధంగా రిపోర్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ ఉంది. మైనారిటీ మద్దతు లభిస్తుంది. అటు చంద్రబాబు విజన్ ని కోరుకునే వాళ్ళల్లో యువత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో యువత బాబు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Also Read: Pushpa Raj : సోలోగానే పుష్ప రాజ్.. ఆ సాహసం ఎవరు చెయ్యట్లేదు..!