అమరావతి మహిళల(Amaravati Women’s)పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రధాన నిందితుడైన జర్నలిస్ట్ కృష్ణరాజు(Krishnam Raju)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ‘అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూ నేపథ్యంలో కృష్ణరాజు పరారీలో ఉండగా, పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా బుధవారం రాత్రి విశాఖపట్నం జిల్లా భీమిలి సమీప గోస్తనీ నది వద్ద అరెస్ట్ చేశారు.
CM Chandrababu : విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రికి సీఎం సూచన
ఈ కేసులో ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. తర్వాత మంగళగిరి కోర్టులో హాజరు పరిచిన తర్వాత ఆయనకు 14 రోజుల న్యాయహిరాసత్ విధించారు. వీరిద్దరిపై మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో సత్యవంతమైన విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. కృష్ణరాజు వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా మహిళలు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాక్షి మీడియా కార్యాలయాల వద్ద నిరసనలు, ముట్టడులు నిర్వహించారు. మహిళలపై తక్కువ మాటలు మాట్లాడటం పట్ల సమాజం ఆగ్రహంతో రగిలిపోతోంది.