Site icon HashtagU Telugu

Krishna Teja : ఎవరీ కృష్ణతేజ..పవన్ ఎందుకు ఏరికోరి ఎంచుకున్నాడు..?

Krishnateja Ias

Krishnateja Ias

కృష్ణతేజ ఐఏఎస్ (Krishna Teja IAS)..రాత్రి నుండి ఈ పేరు సోషల్ మీడియా లో మారుమోగిపోతుంది. ఉప ముఖ్యమంత్రిగా..పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..కృష్ణతేజ ను ఏరికోరి కావాలనుకోవడం తో అంత ఇతడి గురించి మాట్లాడుకుంటూ..ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఈయన ఏంచేసాడు..? ప్రస్తుతం ఏంచేస్తున్నాడు..? పవన్ కళ్యాణ్..స్వయంగా ఈయన్ను ఎంచుకోవడం ఏంటి..? అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66 వ ర్యాంకు సాధించారు. 2015లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్ లో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్‌ దక్కింది. అతి తక్కువ సర్వీస్ లోనే దేశవ్యాప్తంగా తేజకు గుర్తింపు వచ్చింది. 2018లో కేరళలో వరదలు అతలాకుతలం చేసినపుడు తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో అలెప్పీ ఒకటి. అలెప్పీ జిల్లాకు సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు పేరుతో 48గంటల్లో రెండున్నర లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలెప్పీని వరదలు ముంచెత్తుతాయనే సమాచారంతో స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులతో కలిసి భారీ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇది జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. అలెప్పీలో వెంబనాడ్ సరస్సును ఆక్రమించి నిర్మించిన రిసార్టుల్ని కూల్చేసి సంచలనం సృష్టించారు. స్థానికుల న్యాయపోరాటానికి అధికారులు ఎవరు సహకరించని సమయంలో కోట్ల ఖరీదు చేసే రిసార్టుల్ని జేసీబీలతో కూల్చి వేయించి సంచలనం సృష్టించారు.

We’re now on WhatsApp. Click to Join.

కృష్ణతేజ కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా, పర్యాటకశాఖ డైరెక్టర్‌గా , ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా పనిచేసారు. ప్రస్తుతం త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా 2023 మార్చి లో బాధ్యతలు తీసుకున్న కృష్ణతేజ..కరోనాతో తల్లితండ్రులను కోల్పోయిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారికి ఉన్నత విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ చిన్నారుల్లో కలెక్టర్ మామన్‌గా గుర్తింపు పొందారు. కరోనాలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడానికి చొరవ చూపించారు. ఈయన చేసిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపిక చేశారు.

ఇలా కృష్ణతేజ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ..ఇలాంటి అధికారి తన వద్ద ఓఎస్డీగా ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, తాను అనుకున్న విధంగా రాష్ట్ర అభివృద్ధి సాదిస్తుందని భావించి.. చంద్రబాబుతో చర్చించి ఒప్పించారు. దీంతో కృష్ణతేజను ఏపీకి పంపాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇక రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్‌ను కృష్ణతేజ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Read Also :