Site icon HashtagU Telugu

Krishna River : జ‌గ‌న్ పై kCR ఆప‌రేష‌న్, స‌రే అంటే కృష్ణా వాటా ఔట్ !  

Krishna River

Krishna Water

ఏపీ, తెలంగాణ మ‌ధ్య నీటి వాటా (Krishana River) వ్య‌వ‌హారం మ‌ళ్లీ ముదురుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఇష్యూను పెద్ద‌గా చూపించ‌డం కేసీఆర్ కు (KCR)ఆన‌వాయితీగా మారింది. గ‌త రెండు ఎన్నిక‌ల సంద‌ర్భాల్లోనూ నీటి వాటాను ఎక్కువ‌గా ఫోక‌స్ చేశారు. ఈసారి కూడా కృష్ణా, గోదావ‌రి జలాల్లోని నీటి వాటాను విభ‌జ‌న చ‌ట్టానికి విరుద్ధంగా డిమాండ్ చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) సమావేశంలో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. కృష్ణా నీటిలో సమాన వాటా కావాల‌ని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

ఏపీ, తెలంగాణ మ‌ధ్య నీటి వాటా (Krishana River)

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం 34:66 నిష్పత్తిలో తెలంగాణ‌, ఏపీకి(Krishna River) కృష్ణా నీటి వాటా ఉంది. ఆ మేర‌కు కృష్ణా బోర్డు వాటాల‌ను పంచుతోంది. కానీ, కృష్ణా నీటిలో 50శాతం హామీ వాటాను కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ఏళ్ల తరబడి బోర్డును డిమాండ్ చేస్తున్నారు. జూన్ 1న నీటి సంవత్సరం ప్రారంభం కావడం, తగినంత నీటి సరఫరా అవసరమయ్యే ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడంతో, కృష్ణా నది నీటిలో 50:50 వాటాను కేటాయించాలని బోర్డుపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర అధికారులు నిర్ణయించారు.

విభ‌జ‌న చ‌ట్టంలో  తెలంగాణ,  ఏపీ 34:66 నిష్పత్తిలో (Krishna River)

విభజన సమయంలో చేసిన తాత్కాలిక ఏర్పాట్ల వల్ల ఇప్పటివరకు నదీ జలాలను (Krishna River) తెలంగాణ 34:66 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌తో పంచుతుంద‌ని తెలంగాణ చెబుతోంది. గత తొమ్మిదేళ్లుగా బోర్డు అదే కొనసాగిస్తోంది. అయితే, ఈసారి 17వ సమావేశంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన తుది అవార్డ్ ను గుర్తు చేస్తోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసే వరకు తెలంగాణ ప్రతినిధులు తమ సగం వాటా డిమాండ్‌ను నొక్కి చెప్పే అవకాశం ఉంది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం బోర్డుపై ఒత్తిడి పెంచినప్పటికీ బోర్డు విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం తాత్కాలిక ఏర్పాటుకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. కృష్ణా బేసిన్‌లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల నుంచి నీటికి డిమాండ్ పెరుగుతోంది. మే 10న జ‌రిగిన సమావేశంలోనూ బోర్డు వార్షిక బడ్జెట్‌తోపాటు పలు సాంకేతిక అంశాలు, రివర్‌ బోర్డుల గెజిట్‌ అమలు తదితర అంశాలపై కూడా చర్చించారు. ప్ర‌తి ఏడాది మాదిరిగా ఈసారి కూడా చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ, ఈసారి కొన్ని నిర్ణ‌యాలు కీల‌కంగా కానున్నాయ‌ని తెలుస్తోంది.

Also Read : Yuvagalam : అప్పుడు ఇప్పుడు తోడ‌ళ్లుల్ల హ‌వా

ఏపీ, తెలంగాణ నీటిపారుద‌ల అధికారులు ఇచ్చే ప్రొజెక్ష‌న్ ఆధారంగా నీటి కేటాయింపులు ఉండ‌వు. విభ‌జ‌న చ‌ట్టంలో ప‌లు అంశాల‌ను పొందుప‌రిచారు. వాటి ఆధారంగా ఏపీకి ఆస్తులు రావాలి. సుమారు 3ల‌క్ష‌ల కోట్ల విలువైన సంప‌ద 9, 10 షెడ్యూల్ లో ఉంది. వాటి విభ‌జ‌న జ‌ర‌గ‌లేదు. కానీ, నీటి వాటాను మాత్రం 50శాతం కావాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తోంది. ఇప్ప‌టికే స‌చివాల‌యాన్ని ఉదారంగా ఇచ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈసారి కృష్ణా నీటి వాటాలోనూ జారీపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఏపీ ఆందోళ‌న చెందుతోంది.

Also Read : Telugu states : ఏపీ, తెలంగాణ‌కు మ‌రో నేష‌న‌ల్ హైవే! విలీనమా?