Site icon HashtagU Telugu

Krishna Prasad : చంద్రబాబు ను తిడితేనే వైసీపీ లో పార్టీ టికెట్ – వసంత కృష్ణ ప్రసాద్

Krishnaprasad Ycp Tikect

Krishnaprasad Ycp Tikect

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ..ఏ పార్టీ లో చేరతారో చెపుతారని అంత భావించారు కానీ చివరి నిమిషంలో తన ప్రకటనను వాయిదా వేశారు.

వైసీపీ అధినేత జగన్ (Jagan) కు వరుసపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా జగన్ టికెట్స్ కేటాయిస్తుండడం తో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ పార్టీ నుండి బయటకు వచ్చి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..తాజాగా మరో వైసీపీ నేత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) వైసీపీ కి గుడ్ బై చెప్పి జనసేన లో చేరతారని కొద్దీ రోజులుగా ప్రచారం నడుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఈరోజు తన వర్గంతో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తన సామాజిక వర్గానికే చెందిన చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేయమని అధిష్టానం పలుమార్లు సూచించినా అలా చేయలేదు. దీంతో తనను పార్టీ అనుమానించడం మొదలుపెట్టింది. కానీ తాను విమర్శలకు వ్యతిరేకమని చెప్తే తనను అనుమానించడం ఏంటని అవమానంగా భావించారు. ప్రజలకు సేవ చేయలేనప్పుడు తానెందుకు ఎమ్మెల్యేగా ఉండాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా ఉండీ ఏం చేయలేని పరిస్ధితుల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు. వైసీపీ అధిష్టానికి కక్షసాధింపులు వద్దు, వైఎస్ లా పాలించాలంటూ హితవు పలికారు. చంద్రబాబు, లోకేష్ ను తిట్టని నిన్ను ఎలా నమ్మాలని స్వయంగా జగనే ప్రశ్నించారన్నారు. విపక్ష నేతల్ని తిట్టని వాళ్లకు టికెట్లు ఇవ్వనని చెప్పేశారన్నారు. ప్రస్తుతం రాజకీయాలు వదిలేసి వ్యాపారాలు చేసుకుందామని అనుకున్నానని, కానీ శ్రేయోభిలాషులు రాజకీయాల్లోనే ఉండమంటున్నారన్నారు. దీంతో తాను త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తానన్నారు.

Read Also : Balka Suman : సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం తో రెచ్చిపోయిన మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే