ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ (YCP) ఘోర పరాజయం మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. 175 కు 175 సాధిస్తాం..కుప్పంలో చంద్రబాబు ను ఓడిస్తాం..పిఠాపురంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను , మంగళగిరి లో లోకేష్ ను , హిందూపురం లో బాలకృష్ణ కు ఓడగొడతాం..మరోసారి జగన్నా సీఎం కాబోతున్నాడని..అంతే కాదు జూన్ 09 న వైజాగ్ లో జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని తెగ చెప్పుకొచ్చారు. కానీ ప్రజలు మాత్రం 175 కాదు కదా కానీ 20 మందిని కూడా గెలిపించలేదు.
We’re now on WhatsApp. Click to Join.
కేవలం 11 మంది మాత్రమే విజయం సాధించారు. ఇంత ఘోరంగా ఎలా ఓడిపోయామా అని జుట్టు పీకుంటూ మీడియా ముందు తెగ బాధపడుతున్నారు. కొంతమంది నేతలు ఎలా ఓడిపోయామో అర్ధం కావడం లేదంటూ చెపుతుంటే..మరికొంతమంది మాత్రం వాలంటీర్ వ్యవస్థ, ఐప్యాక్ టీమ్ వల్లే ఓటమి చెందామని చెపుతున్నారు.
తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) సైతం ఈ వ్యాఖ్యలే చేసారు. ‘ వాలంటీర్ వ్యవస్థ, ఐప్యాక్ టీం వాళ్లను నమ్మి YS జగన్ కార్యకర్తలు, MLAలకు సైతం సముచిత స్థానం కల్పించలేదు. ఐప్యాక్ పనికిమాలిన సంస్థ. అందులో రాజకీయాలకు పనికిరాని డిగ్రీలు చదివిన వారు తమ పబ్బం గడుపుకున్నారు. MLAలపై అసంతృప్తిగా ఉన్న వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని నివేదికలు పంపారు’ అని ధ్వజమెత్తారు.
Read Also : Ramoji Rao : గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టిన రామోజీ తట్టుకుని నిలబడ్డాడు – పవన్ కళ్యాణ్