Pawan Letter : పవన్ లేఖ ఫై కొట్టు సత్యనారాయణ ఆగ్రహం..ఆధారాలు చూపిస్తావా..?

వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని , దీనిపై దృష్టి సారించి, వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ప్రధాని మోడీ(PM Modi)కి లేఖలో రాసారు. దీనిపై మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇళ్ల స్థలాల్లో 35 వేల కోట్లు స్కాం జరిగిందని అనడానికి ఆధారాలు చూపిస్తావా అంటూ ప్రశ్నించారు. We’re now on WhatsApp. Click to Join. దేశంలో […]

Published By: HashtagU Telugu Desk
Andhra Pradesh Endowments Minister Kottu Satyanarayana Press Meet

Andhra Pradesh Endowments Minister Kottu Satyanarayana Press Meet

వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని , దీనిపై దృష్టి సారించి, వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ప్రధాని మోడీ(PM Modi)కి లేఖలో రాసారు. దీనిపై మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇళ్ల స్థలాల్లో 35 వేల కోట్లు స్కాం జరిగిందని అనడానికి ఆధారాలు చూపిస్తావా అంటూ ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశంలో ఎక్కడలేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీలో మీ నాయకులు నెగ్గుతారో లేదో ముందు అది చూడు, అది మానేసి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నావ్ అంటూ వ్యాఖ్యానించారు. 35 వేల కోట్లు అవినీతి ఎలా జరిగిందని పవన్ కళ్యాణ్‌ని మోడీ అడిగితే ఏం చెప్తారని ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీతో విచారణ జరపాలన్న పవన్ కళ్యాణ్.. ఇంటర్‌పోల్‌ను మర్చిపోయాడని అన్నారు. కాపులు నాకు ఓట్లు వేయలేదు అని అంటున్నావ్ మరి నీకు ఎవరు ఓట్లు వేశారంటూ పవన్‌ను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు హయంలో స్కిల్ స్కాం, అమరావతి భూముల స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం అన్ని స్కాములే అంటూ విమర్శించారు. ఈ స్కామ్‌లలో పవన్ కళ్యాణ్‌కు కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు.

Read Also : Pawan Letter to PM Modi : వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంఫై ప్రధానికి పవన్ కళ్యాణ్ లేఖ.. 

  Last Updated: 30 Dec 2023, 04:19 PM IST