Kothapalli Subbarayudu : జనసేన తీర్థం పుచ్చుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు..

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 11:36 PM IST

ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలలో వలసల పర్వం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఈసారి అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. కొంతమంది టికెట్ ఖరారు కాకపోవడం తో పార్టీ కి రాజీనామా చేస్తుండగా..మరికొంతమంది ఈసారి వైసీపీ గెలుపు కష్టమే అనే అనుమానంతో రాజీనామా చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. తాజాగా, సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా జనసేన పార్టీలో చేరారు. హైదరాబాదులో పవన్ కల్యాణ్ సమక్షంలో కొత్తపల్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapalli Subbarayudu)కు జనసేన కండువా కప్పిన పవన్ కల్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. రాబోయే ఎన్నికల్లో జనసేన విజయానికి కృషి చేయాలని సూచించారు. కొత్తపల్లి చేరికతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తమ పార్టీ మరింత బలపడుతుందని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, అందుకే తమ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని తెలిపారు. టీడీపీ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న కొత్త సుబ్బారాయుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా మాజీ సీఎం చంద్రబాబు కేబినెట్‌లో పనిచేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకూ కీలకంగా పనిచేశారు. అనంతరం వైసీపీలో చేరారు. జనసేనలో చేరుతున్నట్టు ఇటీవలే సుబ్బారాయుడు ప్రకటించారు. సోమవారం మంచి రోజు కావడంతో పార్టీలో చేరినట్లు తెలుస్తుంది. కొత్తపల్లి సుబ్బారాయుడు వచ్చే ఎన్నికల్లో నరసాపురం సీటును ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన మలి జాబితాలో ఆయన పేరు ఉండే అవకాశాలున్నాయి.

Read Also : Komatireddy: విద్యార్థులు ఉద్యోగ సాధనతో పాటు కమ్యూనికేషన్లు డెవలప్ చేసుకోవాలి: మంత్రి కోమటిరెడ్డి