Site icon HashtagU Telugu

Kothapalli Subbarayadu : జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి

Kothapalli Subbarayadu Join

Kothapalli Subbarayadu Join

జనసేన పార్టీ (Janasena ) లోకి చేరబోతున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (Kothapalli Subbarayadu). జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సిద్ధాంతాలు, కమిట్మెంట్కు ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..స్వప్రయోజనాల ఆశించకుండా రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే, పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలు నచ్చడంతో జనసేన లో చేరుతానని తెలిపారు. గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి యువతకు ఆరాధ్య నాయకుడని అన్నారు. ఆయన సొంత సొమ్ము వెచ్చించి కౌలు రైతులకుఆర్ధిక సహాయం అందిచరన్నారు. రాజధాని అమరావతి విషయంలో ఆయన పోరాటం ఎనలేనిదన్నారు. రైల్వే జోన్‌, ప్రత్యేక హౌదా కోసం నిర్మొహమాటంగా పోరాటం చేశారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

1989, 94, 99, 2004లో టీడీపీ తరఫున MLAగా కొత్తపల్లి విజయం సాధించి… ఆ సమయంలో మంత్రిగా కూడా పని చేశారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో తిరిగి టీడీపీలో చేరారు. 2019లో వైసీపీలో చేరిన ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాలు తలెత్తడంతో వైసీపీని వీడారు. ఇక ఇప్పుడు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నర్సాపురం నుంచి అసెంబ్లీ (Narsapuram Assembly Constituency)కి పోటీ చేయాలనే ఆలోచనలో సుబ్బారాయుడు ఉన్నట్లు వినికిడి. ముందుగా టీడీపీలోకి వెళ్దామని నిర్ణయించుకున్నప్పటికీ.. పొత్తులో ఈ సీటు జనసేనకు రావచ్చనే అంచనాతో పవన్ పార్టీలోకి వెళ్లినట్లు సమాచారం. అయితే నర్సాపురం సీటు కోసం ఇప్పటికే జనసేన నుంచి బొమ్మిడి నాయకర్, టీడీపీ నుంచి మాధవ నాయుడు, ఎన్నారై కొవ్వలి నాయుడు రేసులో ఉన్నారు. తాజాగా సుబ్బారాయుడు ఎంట్రీతో సీటు పైన చర్చ మొదలైంది. మరి ఫైనల్ గా నర్సాపురం సీటు ఎవరికీ దక్కుతుందో చూడాలి.

Read Also : Niharika : తిరుపతి నుండి జనసేన తరుపున నిహారిక పోటీ..?