కోరింగ.. ఇక ఏకో సెన్సిటివ్ జోన్..!

కోరింగ అభయారణ్యం.. మనదేశంలోని అతిపెద్ద అడవుల్లో ఇదొకటి. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవులు గోదావరి నది ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. సముద్రతీరానికి చేరువగానూ ఉన్నాయి. ముఖ్యంగా మాడ అడవులకు పెట్టింది పేరు ఇది. ఇక్కడ ఉన్న వాచ్ టవర్ ఒక ప్రత్యేకత. దాన్నిపైనుంచే చూస్తే కోరింగ అడవి మొత్తం కనువిందు చేస్తుంటుంది.

  • Written By:
  • Publish Date - October 4, 2021 / 02:44 PM IST

కోరింగ అభయారణ్యం.. మనదేశంలోని అతిపెద్ద అడవుల్లో ఇదొకటి. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవులు గోదావరి నది ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. సముద్రతీరానికి చేరువగానూ ఉన్నాయి. ముఖ్యంగా మాడ అడవులకు పెట్టింది పేరు ఇది. ఇక్కడ ఉన్న వాచ్ టవర్ ఒక ప్రత్యేకత. దాన్నిపైనుంచే చూస్తే కోరింగ అడవి మొత్తం కనువిందు చేస్తుంటుంది. కోరింగ చుట్టూ గోదావరి నది, పెద్ద పెద్ద చెట్లతో కూడిన అడవులు విస్తరించి ఉండటంతో ఎన్నో రకాల పక్షులకు నివాసంగా మారింది.

పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కోరింగపై కీలక నిర్ణయం తీసుకుంది. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టున్న 177.30 చదరపు కిలోమీటర్లను పర్యావరణ సున్నితమైన జోన్ ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ఆధారంగా పర్యావరణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కోరింగ అభయారణ్యం సముద్ర వైపున 500 మీటర్ల నుంచి 5 కిమీ వరకు పోర్ట్ పరిమితులను మినహాయించి, ఉత్తర సరిహద్దు వైపు 50 మీటర్లు, దక్షిణ వైపు 11.5 కిమీ వరకు, కాకినాడ నగరం వైపు నుంచి 50 మీటర్ల వరకు పరిమితమైంది.

పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయంతో కాకినాడ సిటీ భవిష్యత్తు అభివృద్ధి అవసరాలు, కాకినాడ పోర్టు ప్రస్తుత కార్యకలాపాలు, అభయారణ్యం చుట్టూ స్థిరపడే గ్రామస్తుల ప్రాథమిక జీవనోపాధి కార్యకలాపాలు మరోసారి చర్చకు రానున్నాయి. కోరింగ చుట్టూ ఉండే ఈ సెన్సిటివ్ జోన్ ను రక్షించడానికి రెండేండ్లలో జోనల్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  కోరింగ ఒకవేళ సెన్సిటివ్ జోన్ మారితే.. పర్యావరణంగా మరింత డెవలప్ మెంట్ సాధిస్తుంది.