Site icon HashtagU Telugu

Chiranjeevi : క‌మ‌లంలో `మెగా` గుభాళింపు?

Chirajeevi Upasan

Chirajeevi Upasan

మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ పెద్ద‌లు ప్రాధాన్యం ఇస్తున్నారు. అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా ఆయ‌న్ను సొంతం చేసుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇటీవ‌ల భీమ‌వ‌రంలో జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా చిరంజీవికి ప్ర‌త్యేక ఆహ్వానం ల‌భించింది. ఆ వేదిక‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆయ‌న మీద చూసిన అప్యాయ‌త అందరికీ తెలిసిందే. తాజాగా ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాలిటీ ఆఫ్ ద ఇయ‌ర్ -2022 పుర‌స్కారంకు ఎంపికైన‌ చిరంజీవిని అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు మోడీ. దానికి మురిసిపోయిన చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్ వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌ల‌ను తెలియ‌చేడం గ‌మ‌నార్హం.

సాధార‌ణంగా సినిమా వేదిక‌ల‌పై ఆ రంగానికి సంబంధించిన అంశాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించే చిరంజీవి ఇటీవ‌ల రాజ‌కీయాల‌ను జోడిస్తున్నారు. గాడ్ ఫాద‌ర్ సినిమాలోనూ `రాజ‌కీయాలను నేను వ‌దిలేశాను.. రాజ‌కీయాలు న‌న్ను వ‌ద‌ల‌డంలేదు.`అనే డైలాగ్ ను ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియాలో ఉంచారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ గురించి ప్ర‌స్తావించారు. రాజ‌కీయాల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ప‌వ‌న్ కు ఉన్నాయ‌ని కొనియాడారు. రాబోవు రోజుల్లో సీఎం అవుతార‌ని ఆ వేదిక‌పై ప్ర‌స్తావించారు. అందుకోసం జ‌న‌సేనాని చేసే ప్ర‌య‌త్నాల్లో వెన్నంటి ఉంటాన‌ని వెల్ల‌డించారు. తాజాగా చిన్న‌నాటి స్నేహితుల‌తో న‌ర‌సాపురం కేంద్రంగా వైఎన్ కాలేజిలో జ‌రిగిన ఫంక్ష‌న్లోనూ ప‌వ‌న్ నాయ‌క‌త్వాన్ని కొనియాడారు. అత్యున్న‌త ప‌ద‌విని ఏరోజైనా చేజిక్కించుకుంటార‌ని ఆశాభావాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. ఇక గోవా ఇఫీ అంత‌ర్జాతీయ చ‌ల‌నచిత్రోత్స‌వం ప్రారంభం సంద‌ర్భంగా బీజేపీ నేత‌ల‌తో క‌లివిడిగా ఆయ‌న ఉండ‌డం భ‌విష్య‌త్ రాజ‌కీయ ప‌రిణామాల‌ను సూచిస్తోంది.

Also Read:  AP Politics : సంక్షేమంపై బాబు, ప‌వ‌న్ ఫిదా!

మెగాస్టార్ కోడ‌లు ఉపాస‌న ఏడాది క్రితం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని క‌లిశారు. ఆ సంద‌ర్భంగా ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు ఆనాడు ప్ర‌చారం జ‌రిగింది. అప్ప‌టి నుంచి మెగా ఫ్యామిలీ బీజేపీకి దగ్గ‌ర‌వుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోన్న చ‌ర్చ‌. బీజేపీతో అత్యంత స‌న్నిహితంగా ఉంటోన్న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుటుంబానికి, ఉపాస‌న ఫ్యామిలీ కి మ‌ధ్య బ‌ల‌మైన సంబంధాలు ఉన్నాయి. ఇలా ప‌లు కోణాల నుంచి లోతుగా ఆలోచిస్తే రాబోవు రోజుల్లో బీజేపీని బ‌లోపేతం చేసుకోవ‌డానికి మోడీ, అమిత్ షా ద్వ‌యం మెగాస్టార్ ను బాగా న‌మ్ముకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆ దిశ‌గా తొలి అడుగు భీమ‌వ‌రం వేదికగా జ‌రిగిన ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మోడీ, చిరంజీవి వేశార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

ప్ర‌స్తుతం బీజేపీ, జ‌న‌సేన పొత్తుతో వెళుతున్నాయి. తొలి రోజుల్లో విలీనం కోసం బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఒత్తిడి తెచ్చారు. ఆ విష‌యాన్ని ప‌వ‌న్ ఒకానొక మీటింగ్ లో వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే. ఆ త‌రువాత ఆ రెండు పార్టీల మ‌ధ్య అంత‌ర్గ‌తంగా ఏమి జ‌రిగిందో తెలియ‌దు. ఇటీవ‌ల విశాఖ వ‌చ్చిన సంద‌ర్భంగా మాత్ర‌మే మోడీ, ప‌వ‌న్ భేటీ అయ్యారు. ఆ రోజు నుంచి ప‌వ‌న్ వాయిస్ మారింది. అనివార్యంగా బీజేపీతో క‌లిసి వెళ్లే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే రాబోవు రోజుల్లో మెగా ఫ్యామిలీ బీజేపీ ప్ర‌చారానికి దిగ‌నుంద‌ని అంచ‌నా వేయ‌డ‌కుండా ఉండ‌లేం.

Also Read:  AP Politics : చంద్ర‌బాబు మాట‌ల‌పై జ‌గ‌న్ రివ‌ర్స్