తిరుమల (Tirumala) క్షేత్రంలో గోల్డ్‌మ్యాన్ (Goldman) సందడి చేసారు. ఈయన్ను చూసిన భక్తులు అంత గోల్డ్ మాయం …ఈ మనిషంత గోల్డ్ మాయం అంటూ మాట్లాడుకోవడం ,పాటలు పాడుకోవడం చేసారు. హోప్ ఫౌండేషన్ ఛైర్మన్, హకీ ఛైర్మన్ కొండ విజయ్ కుమార్ (Konda Vijay Kumar) అలియాస్ గోల్డ్ మ్యాన్..ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
మెడలో చిన్న సైజు అనకొండ లాంటి బంగరు గొలుసు, చేతికి కడియాలు, ఉంగరాలు, బంగారు వాచ్‌తో ఏ వైపు చూసిన బంగారమే కనిపించేలా ఆభరణాలు ధరించి విజయ్ క్షేత్రానికి వచ్చారు. ఒక్కసారిగా ఆ బంగారాన్ని చూసిన భక్తులు…గోల్డ్ షాప్ లో కూడా ఈ రేంజ్ లో ఉండవు కావొచ్చు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కనీసం జీవితంలో అంత గోల్డ్ సంపాదిస్తామో లేదో తెలియదు కానీ గోల్డ్ మ్యాన్ తో ఓ ఫోటో అయినా దిగాం అనుకోవచ్చు అని చెప్పి చాలామంది విజయ్ తో సెల్ఫీ లు దిగారు. ఇక స్వామి వారి ఆశీస్సులతో ప్రతి రోజు తమ ఫౌండేషన్ ద్వారా వందాలాది భక్తులకు దర్శన సదుపాయం కల్పిస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తమ ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి దర్శనం కల్పించే అవకాశం కల్పించాలని స్వామి వారిని కోరుకున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు.
Read Also : AP Politics : పవన్ రాజకీయ జీవితాన్ని పిఠాపురంలో జగన్ ముగించాలనుకుంటున్నారా..?